E Palaniswami
-
బహిష్కరణ వేటుపై కోర్టుకు ఓపీఎస్!.. ఈపీఎస్ సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే బహిష్కరణ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. కోటిన్నర క్యాడర్ ఎన్నుకున్న తనను ఎలా తప్పిస్తారని? ఆ అధికారం ఒక్క పళనిస్వామికో, ఇతర నేతలకో అస్సలు లేదని వ్యాఖ్యానించారు. తన బహిష్కరణకు అసంబద్ధంగా పేర్కొన్న ఓపీఎస్.. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని, బహిష్కరణ నిర్ణయంపై చట్ట ప్రకారం కోర్టుకు వెళ్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఓపీఎస్‌కు షాకిస్తూ పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. దీంతో ప్రెసిడియమ్ చైర్మన్ తమిళ్మహాన్ హ్సుస్సేన్ అధ్యక్షతన వనగారమ్లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే ఇంటీరియమ్ జనరల్ సెక్రెటరీగా పళనిస్వామిని ఎన్నుకుంటూ.. అలాగే పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటించింది అన్నాడీఎంకే. డీఎంకేతో కుమ్మక్కయ్యాడు అన్నాడీంకే జనరల్ సెక్రెటరీ(ఇంటీరియమ్) హోదాలో ఈ పళనిస్వామి.. పన్నీర్‌సెల్వంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. అధికార పక్షం డీఎంకేలో పన్నీర్‌సెల్వం కుమ్మక్కు అయ్యాడంటూ సంచలన ఆరోపణలే చేశారు ఓపీఎస్. ఓపీఎస్ హింసాకాండకు పాల్పడ్డాడు. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఎన్నిసార్లు అభ్యర్థించినా.. పోలీస్ భద్రత కల్పించలేదు. శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేంటి?. .. పార్టీకి ఒక్కరే నేత ఉండాలని సీనియర్లు చెప్పిన సూచనను సైతం ఓపీఎస్ పెడచెవినపెట్టాడు. నేను మీలో ఒక్కడినే(పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి..). ఈ పార్టీనే నా జీవితం. పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా.. పని చేశా. ఇద్దరి నాయకత్వంలో పని తీరు ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ ఒక దుష్టశక్తితో పోల్చారు. డీఎంకే ప్రభుత్వం అంటే.. కమీషన్లు, అవినీతికి కేరాఫ్. అలాంటి పార్టీ ప్రభుత్వంపై ఓపీఎస్ కొడుకు ఓపీ రవీంద్రన్ లోక్ సభ సభ్యుడిగా ఉండి మరీ.. ప్రశంసలు గుప్పిస్తున్నాడు. అలాగే ఓపీఎస్ ఒక్కడే పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించొద్దంటూ వాదించాడు.. కోర్టుకెక్కాడు అంటూ పళని స్వామి విమర్శలు గుప్పించారు. -
అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువరికి గాయలవ్వగా.. వాహనాలు ధ్వసం అయ్యాయి. పళనిస్వామి నేతృత్వంలోని జనరల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వెలుపల పన్నీర్ సెల్వం మద్దతుదారులు నిరసన తెలిపారు. — ANI Digital (@ani_digital) July 11, 2022 పళనిస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పార్టీ కార్యాలయాన్ని పన్నీర్ సెల్వం( ఓపీఎస్) వర్గం స్వాధీనం చేసుకుంది. తన వర్గం నేతలతో ఓపీఎస్ సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతో అన్నాడీఎంకే ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. చదవండి: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ #WATCH | Chennai, TN | Some people injured in the clash that broke out between supporters of E Palaniswami and O Paneerselvam, on the sidelines of party's general council meeting being led by Palaniswami pic.twitter.com/oSruojJUVo — ANI (@ANI) July 11, 2022 #WATCH | O Paneerselvam supporters slap slippers at E Palaniswami's photo as they protest AIADMK's General Council meeting in Vanagaram, Chennai pic.twitter.com/1bLqtnT7To — ANI (@ANI) July 11, 2022 -
ఆ వృద్ధ దంపతులకు ప్రభుత్వ పురస్కారం
సాక్షి, చెన్నై : తమిళనాడు తిరునల్వేలి జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు తమపై దాడికి దిగిన దొంగలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. దొంగలకు ఏ మాత్రం బెదరకుండా షణ్ముగవేల్, సెంతామరై దంపతులు పోరాడిన తీరు స్ఫూర్తి కలిగించేలా ఉంది. అయితే షణ్ముగవేల్ దంపతుల ధైర్యానికి మెచ్చుకుని తమిళనాడు ప్రభుత్వం వారికి సాహస పురస్కారం అందజేసింది. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం షణ్ముగవేల్ దంపతులకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ పురస్కారం ప్రధానం చేశారు. ఈ అవార్డు తీసుకోవడం కోసం షణ్ముగవేల్ దంపతులు బుధవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. తిరునల్వేలి జిల్లా కలెక్టర్ శిల్ప ప్రభాకర్.. సాహస పురస్కారం కోసం ఈ వృద్ద దంపతుల పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ అవార్డు తీసుకున్న అనంతరం షణ్ముగవేల్ మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. తమ ఫిరాద్యుపై వేగంగా స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తాము నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తామని నమ్ముతున్నట్టు చెప్పారు. దొంగలపై ప్రాణాలకు తెగించి ఆ వృద్ధ దంపతులు ప్రదర్శించిన సాహసంపై ఈ కింది లింక్ క్లిక్ చేయండి చదవండి : దుండగులపై వృద్ధ దంపతుల ఎదురుదాడి! -
పళని, రజనీ ఇళ్లలో బాంబులు పెట్టాం
సాక్షి, చెన్నై: బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్‌తో చెన్నై పోలీసులు వణికిపోయారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, నటుడు రజనీకాంత్ ఇళ్లలో బాంబులు పెట్టినట్లు శనివారం ఓ ఆగంతకుడు చెన్నై కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పోయెస్ గార్డెన్‌లోని పళని, రజనీ ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం బాంబులేవీ దొరక్కపోవటంతో అదంతా ఉత్తదేనని తేల్చారు. ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేసిన అధికారులు భువనేశ్వరన్(21) అనే యువకుడిని అరెస్ట్ చేశారు. కడలూరుకు చెందిన భువీకి మతిస్థిమితం సరిగ్గాలేదు. గతంలోనూ ఇలాంటి పనులను పాల్పడ్డాడని చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ తెలిపారు. 2013లో నాటి సీఎం జయలలిత ఇంట్లో బాంబు పెట్టినట్లు కాల్ చేయగా.. ఆ సమయంలోనూ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పన్నీర్‌కు ఒకటి, నాకొకటి: పళనిస్వామి
చెన్నై: విలీనం తర్వాత అన్నాడీఎంకే పార్టీ కన్వీనర్‌గా పన్నీర్ సెల్వం ఉంటారని తమిళననాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. పన్నీర్ సెల్వం తన వర్గాన్ని విలీనం చేసిన సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాను, కేపీ మనుస్వామి సహ కన్వీనర్లు ఉంటామని చెప్పారు. 11 మంది సభ్యులు సమన్వయ కమిటీ పార్టీని నడుపుతుందని వెల్లడించారు. రెండాకుల గుర్తును నిలబెట్టుకోవడమే ప్రస్తుతం తమ మొదటి ప్రాధాన్యమని అన్నారు. అమ్మ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. తాను చనిపోయిన తర్వాత కూడా పార్టీ వందేళ్లు పైగా వర్ధిల్లాలని జయలలిత ఆకాంక్షిచారని, అమ్మ ఆశయాలకు అనుగుణంగా పార్టీని నడుపుతామని హామీయిచ్చారు. ఇప్పటికీ పార్టీలో బేదాభిప్రాయాలు ఉన్నాయని, కలిసికట్టుగా వీటిని పరిష్కరించుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కలిసి పనిచేయాలని కార్యకర్తకలు పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందని సీనియర్ నేత కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ముందుకు వచ్చి పార్టీని ఒక్కటి చేశారని ప్రశంసించారు. -
మోదీతో పళని భేటీ.. ఆసక్తికర నిర్ణయం!
-
మోదీతో పళని భేటీ.. ఆసక్తికర నిర్ణయం!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసంలో వీరి భేటీ జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మోదీ-పళని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో మోదీ సర్కారుకు పళనిస్వామి మద్దతునివ్వవచ్చునని భావిస్తున్నారు. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మోదీని కలిసిన అనంతరం పళనిస్వామి మీడియాతో తెలిపారు. జయలలిత తర్వాత అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోగా.. అందులో అతిపెద్ద వర్గానికి పళని నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం నేతృత్వంలోని మరో ప్రత్యర్థి వర్గం ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతునివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పళనిస్వామి వర్గం కూడా బీజేపీకి మద్దతునిస్తే.. రాష్ట్రపతి ఎన్నికలను సునాయసంగా గట్టెక్కవచ్చునని కమలనాథులు భావిస్తున్నారు. వచ్చే జూలైలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎన్డీయేకు 51శాతం ఎలక్టోరల్ కాలేజీ మద్దతు అవసరముంది. ప్రస్తుతం బీజేపీకి 48.5శాతం ఎలక్టోరల్ ఓట్ల మద్దతు ఉండగా, అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు సంపూర్ణ మెజారిటీ సాధించాలని బీజేపీ కోరుకుంటోంది. -
ఆందోళన విరమించిన తమిళ రైతులు
న్యూఢిల్లీ: రుణమాఫీ చేయాలంటూ ఢిల్లీలో 41 రోజులుగా ఆందోళన చేస్తున్న తమిళ రైతులు తమ పోరాటానికి విరామం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఇచ్చిన హామీతో ఆందోళన విమరమించారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే మే 25 నుంచి మరోసారి ఆందోళనకు దిగుతామని రైతు నాయకుడు అయ్యాకన్ను హెచ్చరించారు. తమకు రైలు టికెట్లు ఇస్తే ఈ రోజే తమిళనాడుకు బయలుదేరతామని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన పళనిస్వామి ఆదివారం ఉదయం పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, పార్టీ ఎంపీ తంబిదురైతో కలిసి జంతర్‌మంతర్ వద్దకు అడుగు పెట్టారు. ఆయన్ను రైతులు సాదరంగా ఆహ్వానించి తమ గోడును ఏకరువు పెడుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. అక్కడే రోడ్డుపై కూర్చుని సీఎం రైతు నాయకుడు అయ్యాకన్నుతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటానని, ఆందోళన వీడాలని కోరారు. రైతు సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేసిందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అందరికీ న్యాయం జరుగుతుందని, ఆందోళన వీడి రాష్ట్రానికి బయలుదేరాలని కోరారు. సీఎం విజ్ఞప్తిని అయ్యాకన్ను తోసిపుచ్చారు. ప్రధాని మోదీతో సీఎం చర్చించిన అనంతరం వెలువడే ప్రకటన మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధానితో భేటీకి తమను తీసుకెళ్తామన్న సూచన కూడా చేశారని, ప్రధాని ఇచ్చే హామీ మేరకు పోరాటం కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామన్నారు. అక్కడినుంచి సీఎం బయలుదేరి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో రైతుల పోరాటాల ప్రస్తావన తీసుకొస్తూ రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా నిధుల కేటాయింపులు, నీట్ మినహాయింపుపై సీఎం ప్రసంగం సాగింది. రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. ఆందోళన విరమిస్తున్నట్టు ఆదివారం సాయంత్రం రైతులు ప్రకటించారు. -
ఆందోళన విరమించిన తమిళ రైతులు