సేవల్లో లోపాలు ఉండకూడదు
సేవల్లో లోపాలు ఉండకూడదు
Published Thu, Jun 15 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
నరసాపురం : పేదలకు అందించే విద్య, వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రత్యేక అధికారి పీజీ కామత్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని టేలర్ హైసూ్కల్, శారద టాకీస్ వద్ద ఉన్న మున్సిపల్ హైసూ్కల్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని వైద్యులకు సూచించారు. సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి ఎం.సూర్యనారాయణ, ఇన్‌చార్జ్ డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సురేష్ ఆయన వెంట ఉన్నారు.
Advertisement
Advertisement