
ప్రతీకాత్మక చిత్రం
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్‌మీడియట్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం..3.5 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్‌లో ఫెయిల్ అయిన నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment