సాక్షి, మహబూబ్‌నగర్: దిశ నిందితుల మృతదేహాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం శనివారం పరిశీలించింది. మధ్యాహ్నం 1:20 నిమిషాలకు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్దకు వెళ్లి నాలుగు మృతదేహాలు ఉన్నట్టు బృంద సభ్యులు నిర్ధారించుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్‌లో పోస్ట్‌మార్టం రిపోర్టును నిశితంగా పరిశీలించారు. రిపోర్టులోని అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించారు.
ఈ క్రమంలో వారి కోసం గంటరన్నర పాటు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆస్పత్రిలోనే వేచి ఉన్నారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి మరోసారి మృతదేహాలను పరిశీలించిన సభ్యులు.. తిరిగివెళ్లే సమయంలో మృతుల కుటుంబాలతో మట్లాడారు. ఘటనపై వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఇక మూడున్నర గంటల పాటు ఆస్పత్రిలోనే గడిపిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం.. దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనాస్థలిని పరిశీలించేందుకు చటాన్‌పల్లికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment