నేరెళ్లలో దళితులపై పోలీసుల దాడి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది.
ఢిల్లీ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్లకు చెందిన దళితులపై పోలీసుల దాడి వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. నేరెళ్ల ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ)కు ఫిర్యాదుచేసింది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌ఎస్ కుంతియా, టీపీసీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు మంగళవారం ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఆర్సీ కార్యాలయంలో ఫిర్యాదు దాఖలుచేశారు. బాధితులను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించాల్సిందిగా కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది.