సంచలనం రేపిన ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ప్రాథమిక దర్యాప్తు నివేదిక కూడా సిద్ధం చేశారని సమాచారం. డిసెంబర్ 7న హైదరాబాద్ వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి బ్రిడ్జి పరిసరాలను సందర్శించారు. మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో భద్రపరిచిన నిందితుల మృతదేహాలను, పోస్టుమార్టం రిపోర్టులనూ పరిశీలించారు. తిరుగుప్రయాణంలో తొండుపల్లి గేట్ వద్ద ఆగి.. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎస్‌పీఏ)లో ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబ సభ్యులను, దిశ తండ్రి, సోదరి నుంచి వివరాలు సేకరించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, ప్రత్యక్షసాక్షులతో పాటు, ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ అధికారులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ప్రశ్నించారు.