
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: కరోనా నుంచి తమను కాపాడి, ఆదుకునేందుకు చర్యలు చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ)ను సెక్స్ వర్కర్లు కోరారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చినట్టు సెక్స్ వర్కర్స్, అక్రమ రవాణా బాధితుల రాష్ట్ర సమాఖ్య(విముక్తి సంస్థ) రాష్ట్ర కన్వీనర్ మెహరున్నీసా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
కరోనాతో తీవ్రంగా ప్రభావితులైన సెక్స్ వర్కర్లను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ 2020 అక్టోబర్ ఐదో తేదీన, 2021 మే 31న అన్ని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించినా అమలులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జాప్యాన్ని నిరోధించేలా ఎన్‌హెచ్‌ఆర్సీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు మెహరున్నీసా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment