
సాక్షి, హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్నప్పుడు పలు కారణాలతో జరుగుతున్న మరణాలు.. లాకప్‌డెత్‌లు ఏటికేడాది పెరుగుతున్నాయి. 2022లో ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 175 మంది లాకప్‌డెత్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ మేరకు లాకప్‌డెత్‌లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) గణాంకాలను కేంద్ర హోంశాఖ.. పార్లమెంట్‌కు సమర్పించింది. హోంశాఖ నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 669 మంది లాకప్‌డెత్ అయ్యారు.
రాష్ట్రంలో ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన ఖదీర్‌ఖాన్ లాకప్‌డెత్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలోనూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరియమ్మ కస్టోడియల్ డెత్ సంచనాలకు దారితీసింది. గుజరాత్ రాష్ట్రంలో గత అయిదేళ్లలో 80 మంది కస్టోడియల్ డెత్‌కు గురయినట్లు ఆ నివేదిక పేర్కొంది. కాగా, దేశంలో అత్యధికంగా లాకప్‌డెత్‌లు గుజరాత్‌లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ లాకప్‌డెత్‌లు ఎక్కువే నమోదవుతున్నాయి.
కస్టడీలో ఉన్న వారి మృతికి పోలీసుల చిత్రహింసలే ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. లాకప్‌డెత్‌ల విషయంలో నామమాత్రంగా చర్యలు మినహా పోలీసులపై కఠిన చర్యలు ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతిపాదనల మేరకు 201 కేసులలో బాధిత కుటుంబాలకు రూ. 5,80,74,998 పరిహారాన్ని ప్రభుత్వాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment