lockup death
-
బద్లాపూర్ కస్టడీ డెత్.. ఆ ఐదుగురే కారణం
ముంబై: మహారాష్ట్రలో సంచలన రేపిన బద్లాపూర్ స్కూల్ లైంగికదాడి ఘటనలో నిందితుడి లాకప్ మరణంపై మేజిస్ట్రేట్ విచారణ పూర్తయింది. నిందితుడు అక్షయ్ షిండే లాకప్ డెత్‌కు ఐదుగురు పోలీసు అధికారులు బాధ్యులని తేలింది. నకిలీ ఎన్కౌంటర్లో పోలీసులే తమ కుమారుడు అక్షయ్‌ను చంపేశారని తండ్రి అన్నా షిండే ఫిర్యాదుపై ముంబై హైకోర్టు జస్టిస్ రేవతి మొహితె డెరె, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనానికి సోమవారం సీల్డు కవర్లో దర్యాప్తు నివేదికను మేజిస్ట్రేట్ సమర్పించారు. నివేదిక తమకు అందిందని ధర్మాసనం తెలిపింది. థానె క్రైం బ్రాంచి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరె, హెడ్ కానిస్టేబుళ్లు అభిజీత్ మోరె, హరీశ్ తావడెతోపాటు ఒక పోలీస్ డ్రైవర్‌ను కూడా కస్టడీ మరణానికి కారణమని అందులో పేర్కొన్నారని చెప్పింది. దీని ఆధారంగా ఈ ఐదుగురిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక(ఎఫ్ఎస్ఎల్) నివేదికను బట్టి చూస్తే మృతుడి తండ్రి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయ పడింది. ఈ నివేదిక ప్రతిని అన్నా షిండేకు, ప్రభుత్వానికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు ప్రతి, ఆధారాల పత్రాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు తమ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ చేపట్టేదెవరో రెండు వారాల్లో తమకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బద్లాపూర్ స్కూల్లో అటెండర్‌గా పనిచేసే అక్షయ్ షిండే(24)స్కూల్ టాయిలెట్లో ఇద్దరు బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో గతేడాది ఆగస్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 23న అతడు చనిపోయాడు. అక్షయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకు తలోజా జైలు నుంచి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో వీరితోపాటు నీలేశ్ మోరె, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, డ్రైవర్ ఉన్నారు. -
దళితుడి లాకప్‌డెత్?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్‌డెత్‌కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్‌ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్‌కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.బంధువులతో రాజీ..ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్‌డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు. ఆయాసంతో చనిపోయాడంట..ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్‌ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.నోట్లో గుడ్డలు కుక్కి మరీ..నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలుమరోవైపు.. లాకప్‌డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తాళం వేసి పోస్టుమార్టం?మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్‌డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్‌డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి..ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్‌ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.హుస్సేన్‌ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరో సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. -
కోలారు జిల్లాలో లాకప్‌డెత్?
కోలారు: బైక్ చోరీ కేసులో పోలీసులు విచారణకు తీసుకొచ్చిన యువకుడు అనుమానాస్పదరీతిలో మరణించాడు. ఈ సంఘటన కోలారు జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ నల్లరాజుగానిపల్లికి చెందిన ఎరికల మునిరాజు (28) అనే వ్యక్తిని ముళబాగిలు తాలూకా నంగలి పోలీసులు బైక్, మొబైల్ చోరీ కేసులో గత నెల 31న విచారణ కోసం తీసుకొచ్చారు. అతడు పలు దొంగతనాల కేసుల్లో నిందితుడని తెలిసింది. కోలారు జిల్లాలో చోరీపై కేసు నమోదు కావడంతో విచారణ కోసం అరెస్టు చేసి తీసుకొచ్చారు. అతనికి కిడ్నీ సమస్య ఉందని తెలిసి కోలారులోని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మునిరాజు మరణించాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులే చంపారని ఆరోపణ అయితే మునిరాజును గత నెల 21నే తమ గ్రామం నుంచి పోలీసులు తీసుకు వెళ్లారని, స్టేషన్లోనే ఉంచి తీవ్రంగా కొట్టడంతో వల్లనే చనిపోయాడని మునిరాజు తల్లి మునిరత్నమ్మ ఆరోపిస్తోంది. అది కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు ఆస్పత్రి డ్రామా ఆడుతున్నారని బంధువులు మండిపడ్డారు. మృతదేహం మీద గాయాలు ఉన్నాయని, బట్టలు లేవని,ఎడమ కాలికి పెద్ద కట్టు కట్టి ఉందని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన దాఖలాలే లేవని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని కోలారులోని గల్పేటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. -
మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో లాకప్ డెత్ ఘటన కలకలం సృష్టించింది. తాళ్లగుర్జాల పోలీస్ స్టేషన్లో అంజి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన జరగ్గా.. స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో మృతుడి చనిపోయే ముందు క్షణాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో స్టేషన్ హాల్లో కూర్చున్న వ్యక్తి కొద్దిసేపు ఫోన్ చూస్తూ కనిపించాడు. ఏమైందో ఏమోగానీ కాసేపటికి ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అయితే పోలీసుల తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వల్లే అంజీ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే నిందితుడిది లాకప్ డెత్ కాదని పోలీసులు చెబుతున్నారు. అతనికి ఫిట్స్ రావడంతో చనిపోయాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వ్యక్తి మరణానికి గల అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కొట్టడం వల్లే మరణించాడా? లేక నిజంగానే అతనిది సహజ మరణమా తెలియాల్సి ఉంది. కాగా ఓ మహిళ ఇంటిపై దాడి చేసిన చేసులో అంజీని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
2022లో 175 మంది లాకప్ డెత్...
సాక్షి, హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్నప్పుడు పలు కారణాలతో జరుగుతున్న మరణాలు.. లాకప్‌డెత్‌లు ఏటికేడాది పెరుగుతున్నాయి. 2022లో ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 175 మంది లాకప్‌డెత్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ మేరకు లాకప్‌డెత్‌లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) గణాంకాలను కేంద్ర హోంశాఖ.. పార్లమెంట్‌కు సమర్పించింది. హోంశాఖ నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 669 మంది లాకప్‌డెత్ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన ఖదీర్‌ఖాన్ లాకప్‌డెత్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలోనూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరియమ్మ కస్టోడియల్ డెత్ సంచనాలకు దారితీసింది. గుజరాత్ రాష్ట్రంలో గత అయిదేళ్లలో 80 మంది కస్టోడియల్ డెత్‌కు గురయినట్లు ఆ నివేదిక పేర్కొంది. కాగా, దేశంలో అత్యధికంగా లాకప్‌డెత్‌లు గుజరాత్‌లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ లాకప్‌డెత్‌లు ఎక్కువే నమోదవుతున్నాయి. కస్టడీలో ఉన్న వారి మృతికి పోలీసుల చిత్రహింసలే ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. లాకప్‌డెత్‌ల విషయంలో నామమాత్రంగా చర్యలు మినహా పోలీసులపై కఠిన చర్యలు ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతిపాదనల మేరకు 201 కేసులలో బాధిత కుటుంబాలకు రూ. 5,80,74,998 పరిహారాన్ని ప్రభుత్వాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
మెదక్ లాకప్‌డెత్‌పై డీజీపీ అంజనీకుమార్ సీరియస్
-
లాకప్ డెత్‌పై సీరియస్.. భీమడోలు సీఐ, ఎస్ఐ సస్పెన్షన్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో లాకప్ డెత్ ఘటనపై భీమడోలు సీఐ సుబ్బారావు, ఎస్ఐ వీరభద్రరావుపై వేటు పడింది. వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ గురువారం ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఉత్తర్వులిచ్చారు. తమ కుమారుడిని పోలీసులే లాకప్ డెత్ చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. అధికారుల నివేదిక ఆధారంగా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్టు డీఐజీ చెప్పారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. -
కస్టడిలో వ్యక్తి మృతి.. రాత్రి సమయంలో విచారణ చేయొద్దు..
సాక్షి, చెన్నై: రాత్రి సమయాల్లో ఖైదీలను విచారణ చేయవద్దని.. పోలీసులకు రాష్ట్ర డీజీపీ శైలేంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం ఆరు గంటలలోపు వారిని జైలుకు తరలించాలని పేర్కొన్నారు. విఘ్నేష్(25) అనే వ్యక్తి కస్టడీలో మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆ ఆదేశాలు వెలువడ్డాయి. కాగా గత కొన్ని రోజులకు ముందు చెన్నై కెల్లిస్ కూడలి వద్ద సందేహాస్పదంగా వస్తున్న ఆటోను పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అందులో గంజాయి, కత్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని ఆటోలో వచ్చిన విఘ్నేష్, అతని స్నేహితుడిని పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేశారు. ఆ సమయంలో విగ్నేష్‌కు ఫిట్స్ వచ్చినట్లు అతని కీల్పాక్కమ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనికి సంబంధించి ముగ్గురు పోలీసులను విధుల నుంచి తొలగించడం జరిగింది. ఈ కేసును సీబీసీఐడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో డీజీపీ శైలేంద్ర బాబు ఓ ప్రకటన జారీ చేశారు. అందులో ఖైదీలను రాత్రి సమయంలో విచారణ చేయవద్దని స్పష్టం చేశారు. చదవండి: యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి -
కస్టడీ మరణాలపై జాతి మేలుకోవాలి
కొన్ని వారాల క్రితం, 22 ఏళ్ల కుర్రాడు అల్తాఫ్ పెళ్లాడతానని చెప్పి ఒక మైనర్ బాలికను అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఉద్దేశంతోనే అతడు ఆ బాలికను తన స్నేహితుడితో కలిసి ఆగ్రా చేరుకోమని సూచించాడు. వారు అక్కడికి వచ్చాక త్వరలోనే తాను అక్కడికి వస్తానని చెప్పాడు. కానీ అతడా పని చేయలేదు. కారణం అలా చెప్పిన మరుసటి రోజే ఆ అమ్మాయి కుటుంబం చేసిన ఆరోపణలతో పోలీసులు అల్తాఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒక రోజు తర్వాత అతడు చనిపోయాడు. పోలీసు స్టేషన్ వాష్ రూమ్‌లో నేలకు కొన్ని అడుగుల ఎత్తున ప్లాస్టిక్ టాప్కు వేలాడుతూ కనిపించాడు. ఇంటరాగేషన్ చేస్తున్న చోటే అతడు తాను ధరించి ఉన్న జాకెట్ దారం సహాయంతో ఉరివేసుకున్నాడని పోలీసుల ప్రకటన. ఇది విడి ఘటన కాదు. అలాగని విశేష ఘటన అంత కంటే కాదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం గత 20 ఏళ్లలో దేశంలో 1,888 మంది అటు పోలీసు కస్టడీలో లేక జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ చనిపోయారని తెలియడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పైగా ఇవి అధికారికంగా ప్రకటించిన కస్టడీ మరణాల సంఖ్య మాత్రమే. నిజానికి ఎన్ని మరణాలు చోటు చేసుకుని ఉంటాయన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రకమైన నెత్తుటి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. గుజరాత్ కూడా ఈ జాబితాలో చేరుతోందని ఎన్సీఆర్బీ పేర్కొంది. 2020 లోనే గుజరాత్లో 15 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. గతేడాది దేశవ్యాప్తంగా 76 మంది ఇలా చనిపోయారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల ప్రజ లకు వ్యతిరేకంగా రాజ్యమే రెచ్చగొడుతున్న ఆగ్రహావేశాల నేపథ్యంలో ఇలాంటి ఘాతుకమైన మరణాల వైపు భారత దేశం శరవేగంగా దూసుకెళుతోంది. పోలీసు కస్టడీలో లేదా విచారణ సమయంలో జరుగుతున్నట్లు అధికారులు చెబు తున్న కారణాలు రోతపుట్టిస్తాయనడంలో సందేహం లేదు. అనారోగ్యం, గుండెపోటు, వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేర్పించినప్పుడు సహజ మరణం లేదా వయసు కార ణంగా సహజమరణం వంటివి కస్టడీ మరణాలకు కారణా లని చెబుతున్నారు. ఇంత హృదయం లేని వివరణల కారణంగానే కస్టడీ మరణాలపై సుప్రీంకోర్టు ధ్వజమె త్తింది. చట్టబద్దంగా పాలన సాగుతున్న పౌర సమాజంలో కస్టడీ మరణాలకంటే మించిన ఘోరనేరాలు మరొకటి ఉండవని కోర్టు కడిగిపారేసింది. జాతి సిగ్గుపడే విధంగా, అమానుషమైన రీతిలో కస్టడీలో జరుగుతున్న మరణాలపై సుప్రీకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా శాంతిభద్రతల వ్యవస్థలో ఏ ఒక్కరూ లెక్క చేయలేదు. దేశవ్యాప్తంగా ప్రతిపోలీసు స్టేషన్, నిఘా సంస్థ, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీతో సహా ప్రతి కార్యాలయంలోనూ సీసీటీవీలు నెలకొల్పాలని, నైట్ విజన్, ఆడియో రికార్డింగు సౌకర్యం వీటికి తప్పక కల్పిం చాలని గతేడాది నవంబరులో సుప్రీం కోర్టు ఆదేశించింది. పోలీసు స్టేషన్లలో జరిగే ప్రతి విచారణను తప్పకుండా రికార్డు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇంటరాగేషన్ గదులు, లాకప్ గదులు, పోలీసు స్టేషన్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలన్నింటిలో భద్రతా కెమెరాలను ఏర్పర్చాలని కూడా కోర్టు ఆదేశించింది. స్టేషన్లు, ఇంటరా గేషన్ కార్యాలయాల్లోని కారిడార్లు, లాబీలు, రిసెప్షన్ ఏరియాలు, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఉండే గదులు, బయట ఉండే వాష్ రూముల వద్ద కూడా కెమెరాలు అమ ర్చాలని ఆదేశించింది. అలాగే మాదకద్రవ్యాల నిరోధక బ్యూరో, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, తీవ్రమైన మోసాలపై దర్యాప్తు చేస్తున్న ఆఫీసులు– ఇలా అన్ని చోట్లా సీసీటీవీ రికార్డు చేసి వాటిని 18 నెలలపాటు భద్రపర్చా లని ఏ విచారణ క్రమంలోనైనా మానవ హక్కుల ఉల్లం ఘన జరిగినట్లయితే పర్యవేక్షణకు ఇవి ఉపయోగ పడతాయని కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడానికి ఇవన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తన ఈ ఆదేశాన్ని అమలు చేయడానికి ఆరువారాల లోపు గడువు విధించుకుని మరీ కార్యాచరణ పూర్తి చేయా లని సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశం ఎంత అపహాస్యం పాలైందంటే ఇదే సమస్యను మనం సంవ త్సరం తర్వాత ఇప్పుడూ చర్చించుకుంటూనే ఉన్నాం. 2018లో పంజాబ్‌లో జరిగిన ఒక కస్టడీ చిత్రహింసల కేసును విచారించిన సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇదే విధమైన ఆదేశం జారీ చేసింది. కానీ మూడున్నర సంవ త్సరాల తర్వాత కూడా తన ఆదేశాలను అమలు చేయక పోవడంపై అత్యున్నత న్యాయస్థానం అభిశంసించింది. అయినా సరే పోలీసు స్టేషన్లలో ఇలాంటి ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో లాక్డౌన్ నిబం ధనలను ఉల్లంఘించారనే సాకుతో పోలీసులు... తండ్రీ కుమారులను చిత్రహింసలు పెట్టి చంపేసిన ఘాతుక చర్యపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం నవంబర్ 20న సుప్రీం కోర్టు తాజాగా అవే ఆదేశాలు మళ్ళీ జారీ చేసింది. సంవత్సర కాలంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది రైతులు ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు కూడా హామీ ఇవ్వాలన్నది వీరి డిమాండ్. ఈ రైతుల పిల్లలే మన అంతర్జాతీయ సరిహద్దులను పరి రక్షిస్తున్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల సాను భూతి ప్రకటించకపోవడం అటుంచి వారి ట్రాక్టర్లను దేశ రాజధానిలో ప్రజలపైకి తోలారంటూ ఆరోపిస్తున్నాం. చివరకు రైతులపైకి వాహనాలు తోలి చంపిన లఖిం పూర్ ఖేరీ ఘటనపై కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే విచారణ మొదలెట్టారు. యూపీలో స్థానిక పోలీసు బలగాలు చేపట్టే ఎలాంటి విచారణపైనా తనకు నమ్మకం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రభుత్వాధికారం గుప్పిట్లో పెట్టుకున్న శక్తుల ఉచ్చులో మనం పడి పోతు న్నాం. తాము అన్ని చట్టాలకూ అతీతమని, ఎవరి ఆదేశా లనూ, సూచనలనూ తాము పాటించబోమంటున్న అధి కార శక్తుల ప్రాబల్య కాలంలో మనం మనుగడ సాగి స్తున్నాం. ఈ రాజ్యాంగేతర శక్తుల ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే మన సామూహిక చైతన్యం సైతం ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ప్రాథమికమైన, ప్రాణాధా రమైన ఈ చైతన్యాన్ని కూడా మనం కోల్పోతే అది ఎన్నటికీ తిరిగిరాదు. నిజంగానే ఇది మనకు మేలుకొలుపు లాంటి దేనని గ్రహించాలి. – నారాయణ్ రాజీవ్, కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ -
హింసించడం పోలీసుల డ్యూటీ కాదు!
దేశంలో పోలీసు కస్టడీలో నిందితులపై హింసా, ఇతర వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయనీ, మానవ హక్కులకు ముప్పు ఎక్కువగా మన పోలీస్ స్టేషన్లలోనే ఉంటోందనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ పలు సందర్భాల్లో అన్నారు. వాస్తవానికి పోలీసు ఠాణాల్లో నిందితులు చిత్రహింసలకు గురవుతున్నా, దెబ్బలకు తట్టుకోలేక మరణిస్తే తప్ప ఆ నేరం వెలుగులోకి రావడం లేదు. పోలీసు అధికారులు తప్పుడు కేసుల్లో అమాయకుల్ని ఇరికించి, గాయపరచడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలను తయారు చేసినట్లయితే, భారతీయ శిక్షా స్మృతి, సెక్షన్ 167 ప్రకారం అతను శిక్షార్హుడు. నిందితుడిని అరెస్టు చేసి, నేరాన్ని చేసినట్లు ఒప్పుకోమని హింసించినా, భారతీయ సాక్ష్య చట్టం, 1872లోని సెక్షన్ 25, 26 ప్రకారం అటువంటి నేరాంగీకరణలు కోర్టుల్లో చెల్లవు. (చదవండి: ఆ వారసత్వం నేటికీ రేపటికీ అవసరమే!) మానసికంగా, శారీరకంగా నిందితులను గాయాల పాలు చేసి రిమాండుకు పంపేటప్పుడు జడ్జీ దగ్గర వాస్తవాలు చెప్పనివ్వకుండా కొట్టలేదు, తిట్టలేదు అని చెప్పించే పోలీసు వ్యవస్థలో మనం బతుకుతున్నాం. చాలామంది పోలీసులు ప్రజలను కొట్టడం వారి డ్యూటీలో భాగంగా భావిస్తు న్నారు. సుప్రీంకోర్టు 2006లో ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా కేసు తీర్పులో సూచిం చినట్లు జిల్లా, రాష్ట్ర స్థాయి ‘పోలీసు కంప్లయింట్ అథారిటీ’లను ఏర్పాటు చేసి పోలీసుల నేరాలను తగ్గించాలి. తెలంగాణ హైకోర్టు ఆదేశానుసారం జూన్ 2021లో సదరు అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో నం.1093ను ప్రభుత్వం జారీ చేసింది. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. (జైభీమ్: నాటి పోరాటం గుర్తొచ్చింది!) ఈ ఏడాది తెలంగాణలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరియమ్మ కస్టోడియల్ మరణం జరిగింది. ఈ లాకప్ డెత్ కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగించారు. కానీ వీరికి జైలు శిక్ష పడుతుందా? అదేరోజు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో దొంగతనం చేశాడనే అనుమానంతో వీరశేఖర్ అనే గిరిజనుడిని పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భారత దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన మానవ హక్కుల గురించీ, సీఆర్పీసీ, ఐపీసీ చట్టాల గురించీ కనీస అవగాహన అవసరం. పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్యలో పాఠాల రూపంలో బోధించాలి. తెలంగాణాలో ఫ్రెండ్లీ పోలీసులు అని చెబుతున్న ప్రభుత్వం, కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు మానవ హక్కులపై ప్రతియేటా శిక్షణ తర గతులు నిర్వహించాలి. ఖాకీ డ్రెస్సుల్లో ఉద్యోగం చేస్తున్న నేరగాళ్ళను గుర్తించి, ఉద్యోగాల నుండి తొలగించాలి. తక్షణం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీస్ కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. - కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త సామాజిక కార్యకర్త -
బెంగళూరులో పోలీసుల కస్టడీలో ఆఫ్రికన్ మృతి
యశవంతపుర: డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన ఆఫ్రికన్ పౌరుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. జేసీ నగర పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆఫ్రికన్ పౌరున్ని పోలీసులు అరెస్ట్ చేసి 5 గ్రాములు ఎండీఎంఏ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని లాకప్‌లో నిర్బంధించారు. అతనికి ఆరోగ్యం బాగాలేదని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చనిపోయాడు. దీంతో పెద్దసంఖ్యలో ఆఫ్రికన్ పౌరులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు పోలీసులపై దాడికి దిగడంతో లాఠీచార్జి చేశారు. మృతుని వివరాలు వెల్లడించలేదు. వీసా కాలపరిమితి ముగిసినా బెంగళూరులో అక్రమంగా ఉంటూ పట్టుబడిన 38 మందిలో అతడు కూడా ఒకడని పోలీసులు తెలిపారు. -
పోలీసులు కొట్టడం వల్లే అమ్మ చనిపోయింది.. నా కళ్లారా చూశా
అడ్డగూడూరు/చింతకాని: ‘పోలీసులు కొట్టడంవల్లే మా అమ్మ చనిపోయింది. నేను కళ్లారా చూశా. గతనెల 27న డీజీపీ వచ్చి నన్ను, తమ్ముడిని విచారించినప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను’అని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ చిన్నకూతురు స్వప్న పేర్కొంది. సోమవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్‌కు స్వప్న ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అమ్మచావుకు కారణమైన ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లను హత్యానేరం కింద అరెస్ట్ చేస్తారని ఆశించాను కానీ ఇంతవరకు ఎలాంటి కేసు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు, ఫాదర్ బాలశౌరిల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారికి శిక్షపడేలా చేసి మాకు న్యాయం చేయాలని కోరింది. వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. తమ కుటుంబానికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ విద్యాశాఖ ముఖ్యసలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ, మరియమ్మ లాకప్ డెత్‌కు కారణం అయిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను అరెస్ట్ చేయకుండా కేవలం సస్పెండ్ చేసి పోలీస్‌శాఖ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్లో మరియమ్మ డబ్బులు దొం గతనం చేసినట్లు నమోదు చేశారని, కానీ లాకప్ డెత్‌కు సంబంధించిన సమాచారం లేదన్నారు. ఒక ఎస్సీ మహిళను లాకప్‌డెత్ చేసిన పోలీసులను అరెస్ట్ చేయకుండా వదిలేయడం, వారు బయట తిరగడం సరికాదన్నారు. స్వప్నతోపాటు దళిత్ స్త్రీ శక్తి తెలంగాణ రాష్ట్ర కనీ్వనర్, హైకోర్టు అడ్వొకేట్ జాన్సీ గడ్డం, దళిత్ శక్తి కోఆర్డినేటర్ భాగ్యలక్షమ్మ, మరియమ్మ కుటుంబ సభ్యులు ఉన్నారు. -
మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు
చింతకాని/సాక్షి, హైదరాబాద్: మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలోని మరియమ్మ ఇంటికి సోమవారం మంత్రి పువ్వాడతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, సీపీ విష్ణు ఎస్. వారియర్ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు మరియమ్మ కుమార్తెలు స్వప్న, సుజాతకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చెక్కులు, కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు రూ.15 లక్షల చెక్కుతో పాటు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఖమ్మం ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి పువ్వాడ, భట్టి తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మరియమ్మ ఘటన సీఎం కేసీఆర్ దృష్టికి రాగానే, ఆయన స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 35 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. అఫిడవిట్ వేయండి: హైకోర్టు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్ లాకప్‌డెత్ ఘటనలో మృతి చెందిన మరియమ్మ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. అలాగే ఆమె కుమారుడు, కుమార్తెలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. లాకప్‌డెత్ ఘటనపై న్యాయ విచారణ చేయించాలని, మృతురాలి కుటుంబానికి రూ.5 కోట్లు ఆర్థికసాయం అందించేలా ఆదేశించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. లాకప్‌డెత్ ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 2కు వాయిదా వేసింది. చదవండి: ‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’ -
మరియమ్మ కుమారుడికి డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శ
సాక్షి, నల్గొండ/ఖమ్మం: దొంగతనం కేసులో అరెస్టయిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుమారుడు ఖమ్మం జిల్లాలోని సంకల్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్‌ను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. లాకప్‌డెత్ ఘటనపై కుటుంబసభ్యుల నుంచి డీజీపీ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు అడ్డగూడురులో ఏం జరిగిందని, ఎవరు మరియమ్మ, ఉదయ్ కిరణ్‌ను కొట్టారని అడిగి తెలుసుకున్నారు. విచారణ సమయంలో వారిని ఎంతమంది కొట్టారని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.డీజీపీ ముందు ఉదయ్ కిరణ్ కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు తమను అత్యంత క్రూరంగా కొట్టారని డీజీపీకి తెలిపాడు. తమకు న్యాయం చేయాలని ఉదయ్ కిరణ్ డీజీపీని వేడుకున్నాడు. ప్రభుత్వం అండగా ఉంటుందని డీజీపీ భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులను సస్పెండ్ చేశామని చెప్పారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరియమ్మ ఘటన బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని డీజీపీ తెలిపారు. మరియమ్మ కుటుంబం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియ జేస్తామన్నారు. రూల్స్ విరుద్ధంగా ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: మరియమ్మ, ఆమె కుమారుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ? -
ఖమ్మం ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు
-
మరియమ్మ, ఆమె కుమారుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ?
దొంగతనం కేసులో అరెస్టయిన దళిత మహిళ.. లాకప్‌డెత్ కావడం ఇప్పుడు పెద్ద దుమారం లేపుతోంది. కేసు హైకోర్టు దాకా వెళ్లడం.. సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీస్‌శాఖ మెడకు చుట్టుకుంటోంది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల వరుస ఆందోళనలతో ఉన్నతాధికారులు ఒక్కొక్కరిని బాధ్యులను చేస్తూ సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. మరియమ్మ, అతని కుమారుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా.. చనిపోయేంత వరకు దెబ్బలు కొట్టారా.. చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది.. ఇందులో పోలీసుల పాత్ర.. దీనిపై లోతుగా పరిశీలిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి, యాదాద్రి(నల్లగొండ): అడ్డగూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ బాలశౌరి ఇంట్లో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లకుంటకు చెందిన మరియమ్మ వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ నెల 3న మరియమ్మ దగ్గరికి తన కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు శంకర్ వచ్చారు. 5వ తేదీ పాస్టర్ పనిమీద హైదరాబాద్‌కు వెళ్లాడు. 6వ తేదీన తిరిగి వచ్చాడు. తన ఇంట్లో రూ.2 లక్షల దొంగతనం జరిగిందని 16న అతను అడ్డగూడూరు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందు రోజే మరియమ్మ కుమారుడితో కలిసి స్వగ్రామమైన కోమట్లకుంటకు వెళ్లిపోయింది. పోలీసులు పాస్టర్కు చెందిన కారులోనే 17న కోమట్లకుంటకు వెళ్లి మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్, అతని స్నేహితుడు శంకర్‌ను 18న ఉదయం 8 గంటలలోపు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. అయితే డబ్బు పోయిన రోజుకు, పోలీస్ కేసు నమోదైన రోజుకు మధ్యలో పది రోజుల గడువు ఉంది. ఈ సమయంలో పాస్టర్, మరియమ్మల మధ్య డబ్బు విషయంలో ఏం జరిగిందో బయటికి పొక్కనీయడం లేదు. మీకేం పని ఇళ్లకు వెళ్లండి.. మరియమ్మ, ఆమె కుమారుడు, మరో యువకుడిని అడ్డగూడూరుకు తీసుకువచ్చే సమయంలోనే తీవ్రంగా కొట్టారని సమాచారం. దొంగతనం సొమ్మును రికవరీ చేసే క్రమంలో ఇంటరాగేషన్ పేరుతో మరోమారు స్టేషన్లో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారని తెలుస్తోంది. ఇంటరాగేషన్ కోసం ప్రత్యేకంగా ఉంచిన రబ్బర్‌టైర్ బెల్ట్‌తో ‘పోలీస్’శైలిలో కొట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తమను కొట్టవద్దని మరియమ్మ వేడుకున్నట్లు తెలుస్తోంది. కుమారుడిని నడుంకింది భాగంలో కొడుతుండగా అడ్డుకోబోయిన ఆమెను పోలీసులు పక్కకు నెట్టేశారు. మహిళా పోలీస్‌లు లేకుండానే కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక పెద్దగా ఏడుస్తూ అరుస్తుండడంతో పోలీస్‌స్టేషన్ చుట్టుపక్కల ఇళ్లలోని మహిళలు ‘ఏమైంది.. మహిళను ఎందుకు కొడుతున్నారు’ అని ప్రశ్నించగా ‘మీకేం పని ఇళ్లలోకి వెళ్లండ’ని పోలీస్‌లు వారిని బెదిరించినట్లు సమాచారం. అప్పటికే ఆమె కుప్పకూలిపోయిందని, కిందపడిపోయిన మరియమ్మను ఇద్దరు కానిస్టేబుళ్లు చేతులకింద బెల్ట్ పెట్టి పోలీస్ స్టేషన్లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. స్పందించిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం మరియమ్మ లాకప్‌డెత్‌పై ప్రజా సంఘాలు, ప్రతిపక్షపార్టీలు ఆందోళనకు దిగాయి. హైకోర్టు సైతం ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆలేరు కోర్టును ఆదేశించింది. అదేవిధంగా రీపోస్ట్‌మార్టం చేయించాలని, బాధ్యులైన పోలీ సులపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సీఎం కేసీఆర్ లాకప్‌డెత్‌పై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడుగడుగునా పోలీసులపై ఆరోపణలు ► స్పృహ కోల్పోయిన మరియమ్మను పోలీసులు 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ► నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి 11 గంటలకు తరలించారు. ► అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. మృతదేహం మార్చురీలో ఉండగానే పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. ► కొందరు నాయకుల సహకారంతో కేసును తారుమారు చేసే ప్రయత్నాలు జరిగాయి. ► 11 గంటలకు తీసుకువచ్చిన మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయకుండా జా ప్యం చేయడం వెనక పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ► జిల్లాలోని ఓ ఇన్స్పెక్టర్ స్థాయి అధికా రి ఆస్పత్రి వద్దకు వచ్చి బాధితులు, మరికొంత మందితో చర్చించారని సమాచారం. ► అదేరోజు రాత్రి కాంగ్రెస్ ఎస్సీసెల్ నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడం, 19వ తేదీ మరుసటి రోజు వివిధ ప్రజా సంఘాలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ► వైద్యులు మరియమ్మ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్ట్‌మార్టం జాప్యం వెనుక పోలీసుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ► మరియమ్మ పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా రాలేదని భువనగిరి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రకాష్ ‘సాక్షి’తో చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు మరియమ్మ అవవయాల ను పంపించామన్నారు. మరో వైపు హైకో ర్టు ఆదేశాల మేరకు రీపోస్ట్‌మార్టం చేయాల్సి ఉంది. పాస్టర్‌నే వాహనం అడిగిన పోలీసులు మరియమ్మను తీసుకువచ్చేందుకు కారు కావాలని పోలీసులు..సదరు పాస్టర్‌ను అడగగా తన సొంతకారును అప్పచెప్పినట్లు తెలిసింది. అయితే కొంచెం పెద్ద వాహనం కావాలని, ఈ కారు చిన్నగా ఉండడంతో సరిపోదని తిరిగి ఇచ్చేశారు. దీంతో సదరు పాస్టర్ బొలెరోను సమకూర్చినట్లు సమాచారం. ఆ వాహనంలోనే పోలీసులు కోమట్లకుంటకు వెళ్లి నిందితులను తీసుకువచ్చారు. పోలీసులపై చర్యలు ప్రారంభం దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ కేసులో పోలీసులపై చర్యలు ప్రారంభం అయ్యాయి. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ మహేశ్ భగవత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అడ్డగూడురు ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు జానయ్య, రైటర్ రషీద్‌లను ఈనెల 19న భువనగిరి డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆ తరువాత సస్పెండ్ చేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జడ్జితోపాటు పోలీస్‌శాఖ పరంగా మరికొంత మంది పోలీస్ అధికారులపై విచారణ ప్రారంభించారు. -
దళితులపై చేయి పడితే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. అలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. దళితుల విషయంలో సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉందని అన్నారు. దళితులతో పాటు పేదల పట్ల, పోలీసుల ఆలోచనా ధోరణి సానుకూలంగా ఉండాలని పేర్కొన్నారు. దొంగతనం కేసులో పోలీసుల చిత్రహింసలకు గురై లాకప్‌డెత్‌కు గురైన దళిత మహిళ మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.15 లక్షల ఆర్థిక సాయంతో పాటు కుమార్తెలిద్దరికీ చెరో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఈనెల 28న స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్, ఎస్పీలు బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించి రావాలని సూచించారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, కె.రాజగోపాల్‌రెడ్డి, టి.జగ్గారెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్‌లు శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావులతో కలిసి ముఖ్యమంత్రి దాదాపు రెండు గంటల పాటు కాంగ్రెస్ నాయకులతో చర్చించారు. అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించండి మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని, క్షమించదని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడడంలో గుణాత్మక వృద్ధిని సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, జాప్యం చేయకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. చింతకానికి వెళ్లి ఘటన పూర్వాపరాల గురించి తెలుసుకుని బాధితులను పరామర్శించాలని కూడా ఆయనకు సూచించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోండి మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని, ఆమె మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసైని భట్టి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద భట్టి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనుల లాకప్‌డెత్‌లు పెరిగాయని విమర్శించారు. పోలీసులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన స్వేచ్ఛతోనే ఈ సమస్య వచ్చిందని అన్నారు. ఇలావుండగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని కలిసి మరియమ్మ లాకప్‌డెత్‌పై వినతిపత్రం అందజేసింది. జగ్గారెడ్డీ.. మెడికల్ కాలేజీ ఇచ్చినం కదా.. సీఎం తనను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇతర అంశాలపై కూడా కొంతసేపు మాట్లాడారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డినుద్దేశించి ‘జగ్గారెడ్డీ... మీ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ ఇచ్చినం కదా..’అని అన్నారు. ఇందుకు స్పందించిన జగ్గారెడ్డి.. ‘థ్యాంక్స్ అన్నా, కానీ ఎంపిక చేసిన స్థలంలోనే కాలేజీ కట్టేలా చూడండి’అని విజ్ఞప్తి చేయగా ‘అక్కడే కడతారు’అని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి శ్రీధర్‌బాబు, తన నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుకు భూసేకరణ గురించి రాజగోపాల్‌రెడ్డిలు ప్రస్తావించగా సానుకూలంగా స్పందించారు. ఐకేపీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల గురించి కూడా వారితో మాట్లాడారు. చైనా, భారతదేశాల మధ్య విధానాల అమలులో ఉన్న తేడాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ నేతలకు సీఎం అపాయింట్మెంట్ లభించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. దీనిపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. -
లాకప్‌డెత్ కేసు: అవసరమైతే రీపోస్ట్‌మార్టం చేయండి:హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అడ్డగూడురు లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. మరియమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ మరణించారని పిటిషనర్ ఆరోపించారు. మరియమ్మ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. పిటీషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, అడ్డగూడురు లాకప్‌డెత్‌పై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు.అడ్డగూడురు ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలపై వేటు వేశారు. లాకప్‌డెత్‌పై మల్కాజిగిరి ఏసీపీ విచారణ విచారణ చేస్తారని ఆయన ఆదేశాల్లో తెలిపారు. అడ్డగూడురు పోలీస్‌స్టేషన్‌లో 3 రోజుల క్రితం మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మరియమ్మ మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అవసరమైతే రీపోస్ట్‌మార్టం చేయండి: హైకోర్టు అడ్డగూడూరు లాకప్‌డెత్‌పై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారించింది. ఈ కేసులో న్యాయ విచారణకు ఆదేశించింది. లాకప్‌డెత్‌పై విచారణ జరపాలని ఆలేరు మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే రీపోస్ట్‌మార్టం జరపాలని హైకోర్టు సూచించింది. పీఎస్‌లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్? -
తెలంగాణలో దళితుల ప్రాణాలకు విలువ లేదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు బతికే హక్కు, వారి ప్రాణాలకు విలువ లేదా అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ఏడేళ్ల నుంచి దళిత, గిరి జనులపై అనేక అకృత్యాలు జరుగుతున్నాయని, అయినా పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. రూ.2 లక్షల దొంగతనం ఆరోపణతో దళిత మహిళ మరియమ్మను అన్యాయంగా, అతికిరాతకంగా పోలీసులు కొట్టి చంపారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని పేద దళిత కుటుంబాల ప్రాణాలు, వారి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అసలు హోంశాఖ, హోంమంత్రి ఉన్నారా అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. అనేక సందర్భాల్లో ప్రశ్నించే దళిత సంఘాలు మరియమ్మ విషయంలో ఎటు పోయాయని జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
లాకప్ డెత్ పై విచారణ జరిపించాలని కాంగ్రెస్ ధర్నా
-
అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్?
-
అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్?
అడ్డగూడూరు: పోలీసు దెబ్బలు తాళలేక ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. పోలీసులు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ముమ్మాటికి లాకప్‌డెత్ అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన చర్చి ఫాదర్ బాలస్వామి ఇంట్లో ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియ (40) తన కుమారుడు ఉదయ్‌తో కలసి రెండు నెలల నుంచి వంట మనిషిగా పని చేస్తోంది. ఈ నెల 15న బాలస్వామి ఇంట్లో సుమారు రూ.2 లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆయన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటికే స్వగ్రామానికి వెళ్లిపోయిన మరియ, ఉదయ్‌ను పోలీసులు విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారితో పాటు ఉదయ్ స్నేహితుడు శంకర్ వచ్చాడు. విచారణలో భాగంగా తల్లి, కుమారుడిని పోలీసులు విచక్షణారహితంగా కొడుతుండగా శంకర్ అడ్డుకునేందుకు యత్నించారు. అయితే.. అతన్ని కూడా వదలలేదు. దెబ్బలు తాళలేక మరియ స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆమెను మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పోలీసులు ఆమెను వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. తీవ్రంగా గాయపడిన ఉదయ్, శంకర్ భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా, కేసును నీరుగార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచిర్యాలలో తల్లీకూతుళ్ల హత్య -
‘సెల్’ కోసమే దాష్టీకమా?
సాక్షి, చెన్నై: తాము ఆడిన సెల్ఫోన్లను ఇవ్వలేదన్న ఆగ్రహంతో కక్ష కట్టి జయరాజ్, ఫినిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు గురువారం మీడియా ముందుకు వచ్చిన ఐదు రోజుల క్రితం ఏమి జరిగిందో వివరించారు. ఇక, పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. కాగా, సాత్తాన్ కులం లాకప్‌డెత్‌కు నిరసగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల బంద్‌కు వర్తక లోకం పిలుపునిచ్చింది.(డెత్ వార్) తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తానుకులంకు చెందిన తండ్రి కుమారులు జయరాజ్, ఫినిక్స్ పోలీస్ కస్టడీలో ఒకరి తర్వాత మరొకరు మరణించడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను వర్తక లోకం తీవ్రంగా పరిగణించింది. తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో నిరసనలు గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. మృతదేహాల అప్పగింత.... పోలీసుల మీద హత్య కేసు నమోదు చేసే వరకు మృతదేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని జయరాజ్ కుటుంబం స్పష్టం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు నియమించ బడ్డ మెజిస్ట్రేట్ ఆ కుటుంబంతో గురువారం ఉదయం మాట్లాడారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ, మృతదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు సమాచారం. దీంతో కుటుంబీకులు మృత దేహాలకు అంత్యక్రియలు జరిపేందుకు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి పూర్తి వీడియో చిత్రీకరణ మేరకు జయరాజ్, ఫినిక్స్ మృతదేహాలకు పోస్టుమార్టం జరిగింది. మెజిస్ట్రేట్ హామీ మేరకు మృతదేహాల్ని తీసుకుంటున్నామని ఆ కుటుంబం ప్రకటించింది. లాకప్ డెత్ వివాదంలో కొందరు సాక్షులు ఎమి జరిగిందో మీడియా దృష్టికి తెచ్చారు. విచారణలకు బ్రేక్.. సాత్తాన్ కులం వివాదం నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఐజీ, డీఐజీలకు డీజీపీ త్రిపాఠి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేని కీలక కేసులు ఇకమీద పోలీసుల స్టేషన్లలో విచారించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. డీఎస్పీ లేదా, డీఐజీ కార్యాలయాల్లో విచారణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నేడు వర్తక బంద్.... జయరాజ్, ఫినిక్స్లను కొట్టి చంపిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా , పోలీసుల వేదింపులకు చెక్‌పెట్టే విధంగా వర్తక లోకం ఏకమైంశుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చాయి. -
రంగయ్య మృతిపై రాజకీయం..
సాక్షి, పెద్దపల్లి : కస్టడీలో ఉన్న నిందితుడు మంథని ఠాణాలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం రాజకీయరంగు పులుముకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మంథని పోలీసు స్టేషన్లో ఉరేసుకున్న రంగయ్య వ్యవహారం మంథనిలో రాజకీయ దుమారం లేపుతోంది. ఇప్పటికే ఈ సంఘటనపై హైదరాబాద్ సీపీని విచారాణాధికారిగా హైకోర్టు నియమించింది. మరో వైపు రంగయ్య కుటుంబసభ్యులకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల పరామర్శల పరంపర కొనసాగుతోంది. కస్టడీలో ఆత్మహత్య.. విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడుతున్నారనే అభియోగంపై గత నెల 24న రంగయ్యతోపాటు మరో ముగ్గురిని మంథని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంథని మండలం లక్కేపూర్ శివారులో విద్యుత్ తీగలు అమర్చిన సమయంలో ఎస్సై ఓంకార్ ఈ నలుగురిని పట్టుకున్నారు. రామగిరి మండలం బుధవారంపేట పంచాయతీ పరిధిలోని రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్య(52) కేసులో ఏ3గా ఉన్నాడు. కాగా, కస్టడీలో ఉండగానే 26వ తేదీన తెల్లవారుజామున ఠాణా ఆవరణలోని బాత్రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్య విచారణకు హైకోర్టు ఆదేశం పోలీసు స్టేషన్లో రంగయ్య ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉన్న రంగయ్య ఆత్మహత్యపై అనుమానాలున్నట్లు మంథనికి చెందిన న్యాయవాది నాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. మంథని ఎస్సై నుంచి ప్రభుత్వ సీఎస్ వరకు నోటీసులు జారీ చేసింది. కాగా ఇప్పటి వరకు మంథనికి విచారణాధికారి రాకపోవడంతో.. కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరామర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు రాజకీయ దుమారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే వర్గపోరుకు మంథని నియోజకవర్గం పెట్టింది పేరు. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆధిపత్య పోరుకు రెండు గ్రూపులు రంగంలోకి దిగుతున్నాయి. రంగయ్య మృతి ఘటన కూడా సహజంగానే రాజకీయాలకు వేదికగా మారింది. రంగయ్య మృతిపై న్యాయ విచారణ జరిపించాలని, ప్రభుత్వం స్పందించాలని స్థానిక ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్వయంగా రామయ్యపల్లికి వచ్చి రంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చదవండి: మళ్లీ గ్యాంగ్‘వార్’ కాగా, ఈ సంఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారని జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు కాంగ్రెస్ నేతల తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలోనే రంగయ్య కుమారుడు అనిల్ స్పందించాడు. తన తండ్రిని పోలీసులు వేధించలేదని, మృతిని రాజకీయానికి వాడుకోవద్దని కోరారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల నడుమ మాటల యుద్ధం తీవ్రమైంది. భట్టివిక్రమార్క పరామర్శించి వెళ్లిన మరుసటి రోజు గురువారం పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత సైతం రంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కావాలనే రాజకీయం చేస్తున్నారని భట్టివిక్రమార్కపై విమర్శలు గుప్పించారు. ఖాకీల రాజీ! పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న రంగయ్య వివాదం సద్దుమణిగేలా కొంతమంది పోలీసులు కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన రాజకీయరంగు పులుముకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే పరిస్థితి కనిపించడంతో ముందు జాగ్రత్తపడినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రాజీ కుదిర్చి, వాస్తవాలను వెలుగు చూడకుండా చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా రంగయ్య మృతి ఉదంతంపై హైకోర్టు విచారణకు ఆదేశించడం...హైదరాబాద్ సీపీ విచారణాధికారిగా నియమించడం.. సీఎల్పీ నేత న్యాయవిచారణకు డిమాండ్ చేస్తుండడంతో ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారింది. -
కర్ఫ్యూను ధిక్కరించి..
మినియాపొలిస్: జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీస్ కస్టడీలో మృతి చెందడంతో భగ్గుమన్న నిరసనలు మినియాపొలిస్ నుంచి అమెరికాలోని ఇతర నగరాలకు వ్యాపించాయి. కోవిడ్ నేపథ్యంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను ఆందోళనకారులు ధిక్కరించారు. మినియాపొలిస్‌లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగాయి. మినియాపొలిస్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ను నిరసనకారులు చుట్టుముట్టి పోలీసులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక రెస్టారెంట్, బ్యాంకు, మరో కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. భద్రతా కారణాల రీత్యా అగ్ని మాపక సిబ్బంది అక్కడికి రాకపోవడంతో గంటలపాటు మంటలు కొనసాగాయి. డెట్రాయిట్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, అట్లాంటాలో ఆందోళనకారులు పోలీసుకార్లకు నిప్పంటించారు. న్యూయార్క్, హూస్టన్, వాషింగ్టన్ నగరాల్లో భారీగా ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దొంగ నోట్ల చెలామణీకి యత్నించాడన్న ఆరోపణలపై ఫ్లాయిడ్‌ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేడీలు వేసిన తర్వాత ఫ్లాయిడ్‌ను కింద పడేసి, డెరెక్ చౌవిన్ అనే అధికారి అతడి మెడపై 9 నిమిషాల పాటు మోకాలితో తొక్కిపెట్టి ఉంచడంతో అతడు ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో, చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. వీరిపై నేరం రుజువైతే 12 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముంది. అట్లాంటాలో నినాదాలిస్తున్న ఆందోళనకారులు -
మహిళా పోలీసుస్టేషన్లో లాకప్ డెత్..?
సాక్షి, చెన్నై: మహిళా పోలీసుస్టేషన్లో విచారణ నిమిత్తం తీసుకొచ్చిన మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసులు కొట్టి చంపేశారంటూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.తిరునల్వేలి జిల్లా కూడంకులం అణు విద్యుత్కేంద్రం వద్ద ఉన్న అగ్నిమాపక కేంద్రంలో నాగర్‌కోయిల్‌కు చెందిన క్రిస్టోఫర్ పనిచేస్తున్నాడు. ఇతను గతవారం అక్కడి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు వెలుగు చూసింది. దీంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగిక దాడి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన క్రిష్టోఫర్ కోసం వళ్లియూరు పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. అతడి సెల్ నంబర్ ఆధారంగా ఓ క్లూను సేకరించారు. క్రిష్టోఫర్ తరచూ పూమత్తి విలైకు చెందిన ఇజ్రేయల్ భార్య లీలాబాయ్(45)తో మాట్లాడుతూ వచ్చినట్టు తేలింది. దీంతో ఆమెను విచారిస్తే క్రిస్టోఫర్ ఎక్కడున్నాడో అన్నది తేలుతుందని వళ్లియూరు మహిళా పోలీసుస్టేషన్ వర్గాలు భావించాయి. దీంతో శనివారం రాత్రి లీలాబాయ్‌ను విచారణ నిమిత్తం వళ్లియూరు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా ఆమె వద్ద మహిళా పోలీసులు తమదైన పద్ధతిలో విచారించినట్టుంది. ఆదివారం ఉదయాన్నే హఠాత్తుగా లీలాబాయ్ వాంతులు చేసుకుంది. రక్తం వచ్చే రీతిలో వాంతులు చేసుకుని స్పృహ తప్పింది. ఆందోళనకు గురైన ఆ స్టేషన్ మహిళా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీహెచ్‌కు తరలించారు. అయితే చనిపోయిన మహిళను మహిళా పోలీసులే కొట్టి చంపేశారన్న సమాచారంతో పూమత్తి విలైలోన మృతురాలి బంధువుల్లో ఆగ్రహం రేగింది. వారు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాన్ని బుజ్జగించారు. విచారణకు ఆదేశించారు. కాగా, ఆ మహిళాస్టేషన్ ఇన్స్పెక్టర్గా ఉన్న శాంతి సెలవులో ఉండడం, నేర విభాగం ఇన్స్పెక్టర్ అనిత అదనపు బాధ్యతలు స్వీకరించి, ఈ కేసును విచారిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో ఆ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా పోలీసుల వద్ద ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. -
యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
చెన్నై, టీ.నగర్: కాట్టుమన్నార్కోవిల్ పోలీసుస్టేషన్లో యువకుడు అనుమనాస్పదంగా మృతి చెందాడు. ఇది లాకప్‌డెత్ అంటూ యువకుడి బంధువులు పోలీసుస్టేషన్ ముట్టడించడంతో గురువారం ఉద్రిక్తత పరిస్థితుల ఏర్పడ్డాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న విల్లుపురం డీఐజీ విచారణ అనంతరం హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఎస్ఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కడలూరు జిల్లా, కాట్టుమన్నార్‌కోవిల్లో బుధవారం రాత్రి పోలీసులు గస్తీ తిరుగుతుండగా ఆ సమయంలో స్టేట్‌బ్యాంక్ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతను రుద్రచోళై గ్రామానికి చెందిన మూర్తి కుమారుడు వినోద్ (25)గా తెలిసింది. ఇతను రాష్ట్రంలోని పలు ఏటీఎం కేంద్రాల్లో నగదు డ్రా చేసే వారికి సాయపడుతున్నట్లు నటించి మోసాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అతన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గురువారం తెల్లవారుజామున అతని సొంతవూరైన రుద్రచోళైకు తీసుకువెళ్లారు. అతని ఇంట్లో ఆరు ఏటీఎం కార్డులు, నగదు డ్రా చేసిన రిసిప్టులు కనిపించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోలీసు స్టేషన్ లాకప్‌లో ఉంచారు. కొంత సేపటికి శబ్ధం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా వినోద్ తాను కట్టుకున్న పంచెతో కిటికీ చువ్వలకు ఉరేసుకుని ప్రాణాపాయస్థితిలో కనిపించాడు. వెంటనే పోలీసులు అతడిని చికిత్స కోసం కాట్టుమన్నార్కోవిల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స ఫలించక వినోద్ మృతిచెందాడు. పోలీసుస్టేషన్ ముట్టడి: కాట్టుమన్నార్కోవిల్ పోలీసు స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు, ప్రజలు గుమికూడడంతో గురువారం ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసు స్టేషన్లో యువకుడు హత్యకు గురైనట్లు ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాట్టుమన్నార్కోవిల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరపాలని, హత్యకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. దీంతో విల్లుపురం డిఐజీ సంతోష్‌కుమార్, జిల్లా ఎస్పీ అభినవ్, ఎడీఎస్పీ పాండియన్ సహా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందనే ఉద్ధేశ్యంతో మృతదేహాన్ని కాట్టుమన్నార్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కడలూర్ పంపేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులతో చర్చల అనంతరం కడలూరు తీసుకువెళ్లారు. డీఐజీ సంతోష్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వినోద్‌పై అనేక ఏటీఎం ప్రాడ్ కేసులు ఉన్నాయని, అతను పట్టుబడడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపామని అన్నారు. పోస్టుమార్టం వీడియో రికార్డు చేయబడుతుందని, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సమాచారం పంపుతామన్నారు. దీని ఆధారంగా విచారణ జరుగుతుందన్నారు. -
విజయవాడలో లాకప్ డెత్..!
విజయవాడ: నగరంలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని సింగ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నిజం రాబట్టేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారించినట్టు తెలుస్తోంది. పోలీసుల ఇంటరాగేషన్‌లో నిందితుడు సృహ కోల్పొయినట్టు సమాచారం. దీంతో పోలీసులు నిందితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నిందితుడు మృతిచెందాడు. దీంతో గుట్టుచప్పడు కాకుండా, మీడియాకు తెలియకుండా ఈ తతంగాన్ని కానిచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు లాకప్ డెత్‌కు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. -
తెనాలి వాసి ఉలవపాడులో లాకప్‌డెత్!
ప్రకాశం, కందుకూరు: కారు దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు ఉన్నట్టుండి మృతి చెందడం అనుమానాస్పదంగా మారింది. నిండా 30 ఏళ్లు కూడా లేని యువకుడు గుండెపోటుతో మృతి చెందాడంటూ పోలీసులు చెబుతుంటే బంధువులు మాత్రం పోలీసులే కొట్టి చంపారంటూ ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఉలవపాడు పోలీసుస్టేషన్లో శనివారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి తల్లిదండ్రులు, బంధువులతో రాజీ చేసుకుని కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు సాగించినట్లు సమాచారం. తెరపైకి భిన్న వాదనలు.. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై కారు మాయమైనట్లు కావలికి చెందిన చేవూరి వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గత నెల 4వ తేదీన ఉలవపాడు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. కారును పాత నేరస్తుడు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఎలిపోడు గ్రామానికి చెందిన బాబర్‌బాషా(28) చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం పోలీసులు కొంతకాలంగా వెతుకుతున్నారు. శనివారం నెల్లూరులో ఉన్నట్లు గుర్తించిన ఉలవపాడు పోలీసులు అక్కడికి వెళ్లి శనివారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నుంచి ఉలవపాడు తీసుకొచ్చే సరికి గుండెల్లో నొప్పి వస్తున్నట్లు బాబర్‌బాషా తెలపడంతో పోలీసులు అర్ధరాత్రి 11.10 గంటల సమయంలో ఉలవపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ గుండెపోటుతో బాబర్‌బాషా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు అదుపులో ఉన్న యువకుడు అర్ధరాత్రి మృతి చెందినా బయటకు రాకుండా చూసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడి బంధువులు చెబుతున్న వాదన మరో విధంగా ఉంది. పోలీసులు కొట్టి హింసించడం వల్లే బాబర్ మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. తెనాలిలో అదుపులోకి! ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై కారు దొంగతనం చేసిన బాబర్ బాషా కారును గుంటూరులోని ఓ వ్యక్తికి అమ్మినట్లు సమాచారం. ప్రస్తుతం ఓ యువతిని పెళ్లి చేసుకుని తెనాలిలో నివాసం ఉంటున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కారును బాబర్‌బాషానే దొంగతనం చేసినట్లు గుర్తించిన పోలీసులు మూడు రోజుల క్రితమే తెనాలిలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. మూడు రోజుల నుంచి ఉలవపాడు స్టేషన్లోనే ఉంచి పోలీసులు తమదైన శైలిలో విచారించినట్లు సమాచారం. పోలీసులు విచారణ చేసే సమయంలోనే అర్ధరాత్రి ఉలవపాడు స్టేషన్లోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. లాకప్‌డెత్‌ను పక్కదారి పట్టించేందుకు పోలీసులు కొత్త నాటకానికి తెరలేపారనే వాదన ఉంది. ఉలవపాడు పీహెచ్సీలో మృతి చెందినట్లు చెబుతున్న పోలీసులు అక్కడి నుంచి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. నా బిడ్డకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు: తల్లిదండ్రులు బాబర్‌బాషా శనివారం అర్ధరాత్రి మృతి చెందినా తల్లిదండ్రులు, బంధువులకు పోలీసులు విషయం చెప్పలేదు. ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో బాబర్‌బాషా స్వగ్రామం ఎలిపోడు గ్రామానికి వెళ్లి పోలీసులు తమ కొడుకు ఆరోగ్యం బాగా లేక హాస్పటల్లో చేర్చామంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తమను కందుకూరు రమ్మన్నారని తల్లి కరిమున్నీసా చెబుతోంది. పోలీసులే కొట్టి చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులతో రాజీ.. ఈ కేసు నుంచి బయట పడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. మృతుడి తల్లిదండ్రులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యవర్తుల ద్వారా పోలీసులు చర్చలు జరిపారు. చివరకు పోలీసుల ప్రయత్నాలు ఫలించి తల్లిదండ్రులకు కొంత మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఆదివారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కందుకూరు నుంచి తీసుకెళ్లారు. కస్టోడియల్ డెత్‌గానే కేసు: డీఎస్పీ యువకుడి మృతికి సంబంధించి కస్టోడియల్ డెత్ కింద కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు. దీనిపై చీరాల డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ రామారావులు విచారణ చేపడతారన్నారు. పోలీసులు నెల్లూరు నుంచి ఉలవపాడు తీసుకొచ్చే సమయంలో గుండెపోటు రావడం అక్కడి నుంచి పీహెచ్‌సీకి తీసుకెళ్లిన తర్వాత మృతి చెందినట్లు డీఎస్పీ వివరించారు. -
అంతుచిక్కని మిస్టరీ..!
అల్లిపురం(విశాఖ దక్షిణ): సీసీఎస్‌లో లాకప్ డెత్ విషయంలో మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీసీఎస్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని మంగళవారం కలకలం రేగిన విషయం తెలిసిందే. మృతిచెందాడని భావిస్తున్న గొర్లి పైడిరాజు(26) మృతదేహం ఆచూకీ బుధవారం కూడా తెలియక పోవడం విశేషం. ఆరోపణల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఆదేశాల మేరకు విచారణ అధికారి, జేసీపీ దాడి నాగేంద్రకుమార్ మంగళవారం రాత్రి వి చారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం జేసీపీతో పాటు డీసీపీ ఫకీరప్ప, క్రైం డీసీపీ ఏఆర్ దామోదరరావు, ఏడీపీసీ వి.సురేష్‌బాబు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారించారు. మూడు బృందాలు ఏర్పాటు చేశాం గొర్లి పైడిరాజు అనే యువకుడు భారత్ బంద్ రోజున అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎంవీపీ పోలీసులు అదుపుకులోకి తీసుకున్నారని జేసీపీ నాగేంద్రకుమార్ తెలిపారు. బంద్ కారణంగా స్టేషన్లో సిబ్బంది లేకపోవడంతో పండావీధిలో గల ఆయన భార్య ఎర్ని కుమారిని తీసుకొచ్చి బైండోవర్ చేసి పంపించేశామని వివరించారు. తరువాత ఏం జరిగిందో మాకు తెలియదని జేసీపీ తెలియజేశారు. ఈ మేరకు విచారణ చేపట్టేందుకు ముగ్గురు సీఐల నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బృందాలు తిరిగి వచ్చిన తరువాత వివరాలు తెలియజేస్తామని జేసీపీ వివరిచారు. ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులు పైడిరాజు లాకప్ డెత్ అయ్యాడని ఆరోపిస్తున్నారని, రిటైర్డ్ కానిస్టేబుల్ జయకుమార్, సీఐ దుర్గాప్రసాద్‌లే విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, తరువాత మృతదేహాన్ని అక్కడి నుంచి పోలీస్ జీపులో విజయనగరం తరలించి, అక్కడ దహనం చేశారని ఆరోపిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా... అందులో నిజం లేదని జేసీపీ ఖండించారు. వారు ఆరోపిస్తున్న రిటైర్ట్ కానిస్టేబుల్ జయకుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. విచారణలోనే నిజం తెలియాల్సి ఉందని, ఇంతకు మించి తమ వద్ద సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. పైడిరాజు బతికుంటేకోర్టుకు తీసుకురండి గొర్లి పైడిరాజును పోలీసులే లాకప్ డెత్ చేశారని విశాఖ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ఎన్.హెచ్.అక్బర్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం ఆయన సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి జేసీపీ దాడి నాగేంద్రకుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన జేసీపీతో మాట్లాడుతూ గొర్లి పైడిరాజు అనే వ్యక్తిని సీసీఎస్‌కు తీసుకురావడం నిజం కాదా..? అని ప్రశ్నించారు. పైడిరాజును పోలీసులే లాకప్ డెత్ చేశారని ఆరోపించారు. బతికే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారని, అలాంటప్పుడు తక్షణమే పైడిరాజును కోర్టులో హాజరుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని, లాకప్‌డెత్‌కు కారకులైన వారికి షోకాజ్ నోటీసులిచ్చి, జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను, సీఐని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
సీసీఎస్‌లో లాకప్‌డెత్ కలకలం..?
అల్లిపురం(విశాఖ దక్షిణం): విశాఖ నగరంలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీసీఎస్)లో మంగళవారం లాకప్ డెత్ జరిగినట్లు కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారం మేరకు... విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు గొర్లి పైడిరాజు (26)ను సీసీఎస్ పోలీసులు విచారణ నిమిత్తం తీసుకొచ్చినట్లు తెలిసింది. మంగళవారం అతడిని విచారిస్తున్న సమయంలో మృతి చెందినట్లుగా సమాచారం. తక్షణమే పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారని, ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డాకు తెలియడంతో సీసీఎస్ ఏసీపీ వై.గోవిందరావును తన చాంబర్‌కు పిలిపించి హెచ్చరించినట్లు సమాచారం. సీసీఎస్ వద్ద హైడ్రామా విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఏసీపీ గోవిందరావు ఎందుకు వచ్చారని మీడియాను ఎదురు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు అడిగిన దానికి సమాధానం దాటవేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. తరువాత సీసీఎస్‌లో ఉన్నవారు ఒకరొకరు వెళ్లిపోవడంతో స్టేషన్ నిర్మానుష్యంగా మారింది. 6 గంటల తర్వాత మృతదేహం మార్చురీకిఅనుమానాస్పదంగా మృతి చెందిన గొర్లి పైడిరాజు మృతదేహాన్ని పోలీసులు మంగళవారం మధ్యాహ్నమే సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి రహస్యంగా తరలించారు. కానీ రాత్రి 8.45 గంటల సమయంలో మృతదేహాన్ని మార్చురీకి తరలించటం విశేషం. ఈ ఆరు గంటల పాటు మృతదేహాన్ని పోలీసులు ఎక్కడ తిప్పారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు విషయాన్ని బయటకు పొక్కకుండా చూద్దామని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరో పక్క మృతుడు గుండెపోటుతో చనిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మృతుడిపై ఆరు కేసులు మృతుడు గొర్లె పైడిరాజుపై ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నిందితుడిని సీసీఎస్ పోలీస్‌లు విచారణ నిమిత్తం తీసుకొచ్చారు. అతని సహ నిందితుడు దున్నా కృష్ణ సమాచారం కోసం విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గొర్లె పైడిరాజు మృతి చెందినట్లు సమాచారం. విచారణ జరుపుతున్నాం సంఘటపై విచారణ జరుపుతున్నాం. మృతుడు గొర్లె పైడిరాజును విచారణ నిమిత్తం తీసుకొచ్చాం. సోమవారం రాత్రి అతని భార్య వచ్చి తీసుకెళ్లిపోయింది. కానీ ఏం జరిగిందో పూర్తి విచారణ చేపట్టమని నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఆదేశించారు. ఈ మేరకు ప్రస్తుతం విచారణ జరుపుతున్నాం. పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తాం. – దాడి నాగేంద్రకుమార్, జాయింట్ పోలీస్ కమిషనర్, విశాఖపట్నం. -
సనత్‌నగర్ పీఎస్‌లో లాకప్ డెత్?
హైదరాబాద్ : దొంగతనం కేసులో విచారణకు తీసుకొచ్చిన నిందితుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన బుధవారం సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. గుండెపోటుతో మరణించాడని పోలీసులు చెబుతుండగా మరోవైపు వారు కొట్టిన దెబ్బలతోనే చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవున్నాయి. రామంతాపూర్‌కు చెందిన కూలీ ప్రేమ్‌చంద్ (37)ను ఎర్రగడ్డ బజాజ్ ఆటో ఫైనాన్స్ ఏజెంట్లు వాహనాలు, ఈఎంఐల రికవరీ కోసం తీసుకుని వెళుతుంటారు. ఇదేక్రమంలో వారంక్రితం ఓ ఏజెంట్ రికవరీ అయిన రూ.2లక్షలను బజాజ్ ఆఫీసులో చెల్లించాల్సిందిగా ప్రేమ్‌చంద్‌కు ఇచ్చాడు. ప్రేమ్‌చంద్ ఆ డబ్బును ఇవ్వకుండా పరారయ్యాడు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బు భువనగిరిలో దాచిపెట్టినట్లు చెప్పాడు. దీంతో మంగళవారం పోలీసులు అతడిని భువనగిరి తీసుకుని వెళ్లగా అక్కడ డబ్బు దొరకలేదు. అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలోనే నిందితుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దెబ్బలతోనే మరణించాడా? నగదు రికవరీ కోసం పోలీసులు ప్రేమ్‌చంద్‌పై థర్డ్ డిగ్రీని ప్రయోగించడం వల్లే మరణించి ఉండొచ్చని, అందువల్లే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అప్పగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
లాకప్ డెత్ : పోలీసులే చంపేశారు
రక్షక భటులే భక్షకులయ్యారంటూ జనం తిరగబడ్డారు. ప్రజాగ్రహానికి పోలీస్‌స్టేషన్ రణరంగమైంది. ఆందోళనకారులు బీభత్సం సృష్టించి పోలీస్‌స్టేషన్, అక్కడి వాహనాలకు నిప్పుపెట్టారు. స్టేషన్‌లోని విలువైన పత్రాలను తగులబెట్టారు. అలజడి సృష్టిస్తున్న ఆందోళనకారులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. సంబల్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ విధ్వంసకర సంఘటనపై బాధ్యులను చేస్తూ ముగ్గురు పోలీస్ సిబ్బందిపై డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు. భువనేశ్వర్/సంబల్పూర్: సంబల్పూర్ జిల్లాలోని ఒంయిఠాపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన లాకప్‌డెత్ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం అర్ధరాత్రి ఓ నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం ఈ వార్త ప్రసారం కావడంతో సంబల్పూర్లో శాంతిభద్రతలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నెల 7వతేదీన జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో మొబైల్, బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా చోరీ కేసులో ఒంయిఠాపల్లి పోలీసులు భాలూపల్లి గ్రామస్తుడు ఒవినాష్ ముండాను(25) అనుమానిత నిందితుడిగా గురువారం స్టేషన్‌కు తీసుకువచ్చారు. మర్నాడు ఉదయం నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల కథనం. శుక్రవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో కుటుంబీకులకు ఈ వార్త తెలిసింది. జిల్లా ప్రధానఆస్పత్రికి మృతదేహం తరలించినటుŠల్ తెలియడంతో అంతా అక్కడకు చేరారు. మృతుని కుటుంబీకులు, మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని బుర్లా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులే చంపేశారు తమబిడ్డ ప్రాణాల్ని పోలీసులే పొట్టన పెట్టుకున్నారని కుటుంబీకులు వాపోతున్నారు. పోలీసుల వేధింపులు తాళలేని పరిస్థితుల్లోనే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని మృతుని కుటుంబీకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. వీరితో పాటు స్థానికులు కూడా పోలీస్ చర్యల పట్ల సందేహం వ్యక్తం చేస్తున్నారు. దుశ్చర్యలకు ఆత్మహత్య రంగు పులిమి దాటవేతకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో జరిగిన సంప్రదింపులు క్రమంగా వేడెక్కాయి. నిందితుని ప్రాణాల్ని పోలీసులే బలిగొన్నారన్న ఆరోపణ బహిరంగంగా ప్రసారం కావడంతో ఒంయిఠాపల్లి పోలీస్‌స్టేషన్ పరిసరాలు యుద్ధరంగంగా మారాయి. మృతుని కుటుంబీకులు, బంధుమిత్రులతో పాటు స్థానికులు ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. రాళ్లు రువ్వుతూ విజృంభించారు. స్టేషన్లోకి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. స్థానికుల ఆగ్రహావేశాల్ని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఒంయిఠాపల్లి స్టేషన్‌పై నిరవధికంగా రాళ్లు రువ్విన స్థానికులు చివరికి నిప్పు అంటించారు. అలాగే స్టేషన్ ప్రాంగణంలో వాహనాలకు నిప్పుపెట్టి బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో పరిస్థితి చేయి దాటింది. ప్రజలు పోలీసులపై ప్రత్యక్ష తిరుగుబాటుకు సిద్ధం కావడంతో పోలీస్‌స్టేషన్ ఆవరణ రణక్షేత్రంగా మారింది. పోలీసులు, ప్రజల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు సాధారణ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువుర్ని ఆస్పత్రిలో చేర్చారు. స్టేషన్ పరిసరాల్లో బీభత్సానికి పాల్పడిన ప్రజానీకం అనంతరం జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో సంబల్పూర్–ఝార్సుగుడ మార్గంలో వాహనాల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మానవ హక్కుల కమిషన్ విచారణ ఈ సంఘటనపై మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించినట్లు డీజీపీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. ముగ్గురు సభ్యుల మానవ హక్కుల కమిషన్ బృందం ఈ దర్యాప్తు చేపడుతుంది. ఉత్తర ప్రాంతీయ ఇనస్పెక్టర్ జనరల్ ఈ సంఘటనలో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి నివేదిక దాఖలు చేస్తారని డీజీపీ తెలిపారు. సత్వరమే ఈ నివేదిక దాఖలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. సంబల్పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సంప్రదింపులతో మానవ హక్కుల పరిరక్షణ బృందం విచారణ, దర్యాప్తు కొనసాగుతుందని మానవ హక్కుల పరిరక్షణ విభాగం – హెచ్ఆర్పీసీ అదనపు డైరెక్టర్ జనరల్ మహేంద్ర ప్రతాప్ తెలిపారు. ఇన్స్పెక్టర్ ఇన్చార్జిపై వేటు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణ కింద సంబల్పూర్ ఒంయిఠాపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జిని తక్షణమే విధుల నుంచి తప్పించి సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు స్టేషన్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు డీజీపీ ప్రకటించారు. వీరిలో స్టేషన్ డైరీ చార్జ్ ఆఫీసర్, సెంట్రీ ఇన్చార్జి ఉన్నట్లు ఉత్తర ప్రాంతీయ ఇన్స్పెక్టర్ జనరల్ సుశాంత నాథ్ తెలిపారు. 2 యూనిట్ల అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటల్ని నివారించింది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటే శాంతిభద్రతల పరిరక్షణ సక్రమంగా ఉంటుందని డీజీపీ వివరించారు. పరిస్థితి అదుపులోకి రాకుంటే ఈ ప్రాంతంలో 144వ సెక్షన్ విధించడం అనివార్యమవుతుందని డీజీపీ స్పష్టం చేశారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకునేందుకు 7 ప్లాటూన్ల పోలీసు దళాల్ని రంగంలోకి దింపారు. హెచ్ఆర్సీ మార్గదర్శకాలతో పోస్ట్‌మార్టం జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల మేరకు సందిగ్ధ లాకప్ డెత్ సంఘటనలో మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతుంది. వైద్య నిపుణుల బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో శవపరీక్షలు నిర్వహిస్తారు. ఈ యావత్ ప్రక్రియ వీడియో రికార్డింగ్ అవుతుందని సంబల్పూర్ ఎస్పీ సంజీవ్ అరోరా తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం పోలీసు స్టేషన్లో తుదిశ్వాస విడిచిన నిందితుని కుటుంబీకులకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. లాకప్ డెత్‌ను పురస్కరించుకుని ఆయన ఈ పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపట్ల సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
నెల్లూరు జిల్లాలో లాకప్‌డెత్?
► విచారణ పేరుతో కొట్టి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ కోవూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు బుధవారం అర్ధరాత్రి లాకప్‌డెత్‌కు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడి కుటుంబ సభ్యులు దీనిపై ఆందోళన చేపట్టారు. స్థానిక రుక్మిణీ కల్యాణ మండపం సమీపంలో మంగళవారం ఓ వృద్ధురాలి చెవి కమ్మలు చోరీకి గురయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పెళ్లకూరు కాలనీకి చెందిన వెన్నపూస రమణయ్య(43)ను అనుమానిస్తూ బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో రమణయ్య నోటి నుంచి నురగలు కక్కుతూ కూప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతిచెందాడు. పోలీసులు రమణయ్యను విచారణ పేరుతో లాఠీలతో కుళ్లబొడవటంతో మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు వైద్యశాల వద్ద ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్సై వెంకటరావు మాట్లాడుతూ రమణయ్య ఇటీవల కాలంలో ఇందుకూరుపేటలో సైతం మహిళ ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో మెడల్లో నగలు చోరీ చేస్తూ పట్టుబడి రిమాండ్‌కు వెళ్లి విడుదలై వచ్చాడని తెలిపారు. అలాంటి నేరమే మళ్లీ ఈ ప్రాంతంలో జరగడంతో రమణయ్యను అనుమానిస్తూ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించామని ఎస్సై వివరించారు. అతన్ని తాము కొట్టలేదని, అతని మృతికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జంగారెడ్డిగూడెంలో లాకప్ డెత్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఓ హోటల్ కార్మికుడు లాకప్ డెత్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని మాఫీ చేసేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలో వివిధ హోటళ్లలో ఒడిశాకు చెందిన బురిడి లక్ష్మణ్ (33) అనే వ్యక్తి వంట మేస్త్రిగా పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం అతడు జీవనోపాధి నిమిత్తం ఇక్కడకు వలస వచ్చాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత శుక్రవారం మఫ్టీలో ఉన్న పోలీసులు లక్ష్మణ్ వద్దకు వెళ్లి.. అతనిపై కేసు ఉందని, విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు రావాలని అడిగారు. అందుకు అతడు నిరాకరించడంతో ఆగ్రహించిన పోలీసులు మరికొందరు సిబ్బందిని తీసుకెళ్లి బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వారికి లక్ష్మణ్ సహకరించకపోవడంతో థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు సమాచారం. ఒక పోలీసు అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిపై ప్రతాపం చూపడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కంగారుపడిన పోలీసులు లక్ష్మణ్ భార్య, మరికొందరిని పిలిచి అతడి ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్టు సమాచారం. వెంటనే వారు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రాథమిక వైద్యం చేసి.. పరిస్థితి విషమించిందని చెప్పడంతో ఏలూరుకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లగా అక్కడ మృతి చెందినట్టు నిర్థారించారని సమాచారం. అయితే, లక్ష్మణ్ పోలీస్ స్టేషన్లోనే మరణించాడనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టే ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. లక్ష్మణ్ మృతదేహాన్ని అదే రోజున అంబులెన్స్‌లో ఒడిశాలోని అతడి స్వస్థలానికి పోలీసులే తరలించినట్టు చెబుతున్నారు. తన భర్తను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడని లక్ష్మణ్ భార్య రత్నం చెబుతోంది. కాగా, ఘటన నేపథ్యంలో అక్కడి ఎస్సై సెలవుపై వెళ్లినట్టు తెలిసింది. లాకప్ డెత్ కాదు : డీఎస్పీ పోలీసులు కొట్టడం వల్ల లక్ష్మణ్ చనిపోలేదని, అది లాకప్ డెత్ కాదని జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు పేర్కొన్నారు. లక్ష్మణ్ మద్యం సేవించి టైలరింగ్ షాప్‌పై దాడి చేశాడని వచ్చిన ఫిర్యాదు మేరకు అతణ్ణి స్టేషన్‌కు పిలిచి విచారించి పంపించివేశామన్నారు. పోలీసులు కొట్టడం వల్ల అతడు చనిపోయాడని బంధువులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. అతడు క్రానిక్ ఫ్రాంకియాసిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు జంగారెడ్డిగూడెంలో వైద్యం చేసిన డాక్టర్ చెప్పారన్నారు. దీంతో తానే ఏలూరులో ఆశ్రం ఆసుపత్రికి ఫోన్‌చేసి చెప్పి చికిత్స నిమిత్తం అతణ్ణి పంపించానని తెలిపారు. ఈ వ్యాధి ఎప్పుడు సీరియస్ అవుతుందో చెప్పలేమని, ఆ రోజు లక్ష్మణ్ 40కి పైగా వాంతులు చేసుకున్నట్టు వైద్యులు చెబుతున్నారని డీఎస్పీ వివరించారు. -
బేగంపేటలో లాకప్‌డెత్!
హైదరాబాద్: నగరంలోని బేగంపేట పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లాఠీ దెబ్బలు తాళలేకే యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటూ అతని కుటుంబ సభ్యులు, బంధవులు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి బాధితులు బేగంపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న మోహన్ కృష్ణ అలియాస్ రాము కారు డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లావణ్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా.. గత కొన్ని రోజులుగా మోహన్ కృష్ణ తీరులో మార్పు వచ్చి.. లావణ్యకు వరుసకు సోదరి అయ్యే ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న లావణ్య కుటుంబసభ్యులు తీరు మార్చుకోవాలని పలుమార్లు మందలించారు. ఈ క్రమంలో ఆ బాలికను వివాహం చేసుకుంటానని రాము చెప్పడంతో.. ఆగ్రహించిన వారు శుక్రవారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న సాయంత్రం మోహన్ కష్ణాను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు మదరలితో అసభ్యకరంగా ప్రవర్తిస్తావా అంటూ చితకబాదారు. అనంతరం మోహన్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులే విచక్షణారహితంగా కొట్టి తమ కొడుకును చంపేశారని ఆరోపిస్తున్నారు. రెండు గంటలపాటు టైర్ ముక్కతో ఉన్న బ్యాటుతో తన కొడుకున్న కొట్టారని చచ్చాక శవాన్ని అప్పచెప్పారని మృతుని తల్లి రేణుక ఆరోపిస్తోంది. తన చెళ్లెను వివాహం చేసుకుంటానని వేధిస్తుండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశామని.. కానీ పోలీసులు మాత్రం నా భర్త ప్రాణం తీశారని మృతుని భార్య లావణ్య ఆరోపిస్తోంది. కాగా.. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసించిపోయాడని.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడని.. ఈ ఘటనలో పోలీసుల ప్రమేయం లేదని బేగంపేట ఇన్స్పెక్టర్ జగన్ అంటున్నారు. పోలీసుల దెబ్బలకే మోహన్ కృష్ణ చనిపోయాడా.. లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలాల్సి ఉంది. పోలీసుల దెబ్బలతోనే మోహన్ కృష్ణ చనిపోయినట్టు తమ విచారణలో తేలితే.. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. -
‘అనంత’లో లాకప్‌డెత్?
అనంతపురం / వజ్రకరూరు (ఉరవ కొండ) : అనంతపురం జిల్లా వజ్రకరూ రులో పోలీసుల అదుపులో ఉన్న ఓ యువకుడు అనుమానాస్ప దస్థితిలో మృ తి చెందాడు. చోరీ కేసులో అనుమా నితుడుగా 3 రోజులుగా పోలీసుల అదు పులో ఉన్న వన్నేష్ (32) మృతదేహం సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్ సమీపంలోని ముళ్లపొదల్లో కనిపించింది. పోలీసుల విచారణలో చనిపో యాడని ఆరోపిస్తూ అతని బంధువులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. వజ్రకరూరు మండలం ధర్మపురిలో జరిగిన గొర్రెల దొంగతనం కేసులో ఓ ముగ్గురిని పోలీసులు 3 రోజుల కింద తీసుకెళ్లారు. వారిలో వన్నేష్ ఉన్నాడు. అతను శవమై కనిపించడంతో లాకప్‌డెత్‌గా అతని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు తమకు సంబంధం లేదని చెప్తున్నారు. -
హైదరాబాద్ మంగళ్‌హాట్ పీఎస్‌లో లాకప్‌డెత్
హైదరాబాద్: నగరంలోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో లాకప్‌డెత్ జరిగింది. పోలీసులు విచారణ నిమిత్తం భీంసింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా.. శనివారం అతను పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులే భీంసింగ్‌ను కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు భీంసింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ రాంభూపాల్ రావు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని విచారిస్తున్నారు. -
అమ్మాయి మిస్సయిందని.. కుర్రాడి లాకప్‌డెత్
ఉత్తరాఖండ్‌లో ఓ అమ్మాయి ఇంట్లోంచి కనపడకుండా పోయింది. దాంతో పోలీసులు జియాయుద్దీన్ రజా (16) అనే ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. ఏమయిందో ఏమో తెలియదు గానీ.. రజా పోలీసు లాకప్‌లో ఉండగా ఉరికి వేలాడుతూ మరణించాడు. దీంతో ఒక్కసారిగా ఉత్తరాఖండ్ పోలీసులపై నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగు రోజుల క్రితం కనపడలేదన్న ఆ అమ్మాయి ఆచూకీ చివరకు లక్నోలో తేలింది. దాంతో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు తలెత్తాయి. పోలీసులు తమ కొడుకును తీసుకెళ్లేటప్పుడు అతడి దగ్గర ఏమీ లేవని.. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అతడు తాడుతో ఉరేసుకున్నాడని చెప్పడంలో అర్థం ఏముందని బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో నలుగురు పోలీసులను సస్పెండ్ చేసిన సీనియర్ ఎస్పీ సెంథిల్ అబూదెయి మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఒక ఎస్ఐ, ఒక విలేకరి, ఐదుగురు గుర్తుతెలియని పోలీసులు, మరో ఇద్దరు.. మొత్తం 9 మందిపై హత్యకేసు నమోదు చేశారు. రజా మరణానికి కారణమేంటో విచారించి 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. పదో తరగతి చదువుతున్న రజా ఇంటి సమీపంలో ఉండే ఓ అమ్మాయి ఇంట్లోంచి కనపడకుండా పోవడంతో.. అందుకు కారణం ఇతడే అయి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు రజాను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఆ తర్వాత అతడు లాకప్ డెత్ కావడంతో అది తీవ్ర వివాదం అయ్యింది. -
నా భర్తను పోలీసులే కొట్టి చంపారు
రామాంజనేయులు భార్య కన్నీటిపర్యంతం గుండెపోటుతో చనిపోయాడంటున్న పోలీసులు గిద్దలూరు : ఓ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు వారి విచారణ అనంతరం బయటకు వచ్చిన కొద్ది సేపటికే అనుమానాస్పత స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య మాట్లాడుతూ తన భర్త పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం తమ విచారణ అనంతరం బయటకు వెళ్లిన తర్వాత గుండెపోటుతో మృతి చెందాడని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. రాచర్ల మండలం కాలువపల్లెకు చెందిన ఉప్పుతోళ్ల రామాంజనేయులు (33)పై అదే గ్రామానికి చెందిన బంధువులు బాలరాజు, ఆయన భార్య సునీతలు కేసు పెట్టారు. సునీతపై రామాంజనేయులు లైంగికదాడికి యత్నించాడన్నది ఆ ఫిర్యాదులోని సారాంశం. ఈ నేపథ్యంలో రాచర్ల పోలీసులు శనివారం రామాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ నుంచి తన తమ్ముడితో కలిసి రామాంజనేయులు బయటకు వచ్చాడు. ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో రాచర్లలోని వైద్యశాలకు వెళ్లాడు. పోలీసుల విచారణకు భయపడటంతో ఆయనకు బీపీ ఎక్కువై పరిస్థితి విషమించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పడిపోయాకే మా మరిదికి ఫోన్ చేశారు.. తన భర్త రామాంజనేయులుకు ఇతర మహిళలతో ఎలాంటి సంబంధాలు లేవని, అనవసరంగా బాలరాజు, అతని భార్య సునీతలు కేసు పెట్టి పోలీసులతో కొట్టించి చంపేశారని మృతుడి భార్య రమణమ్మ ఆరోపిస్తోంది. తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా పోలీసుస్టేçÙన్కు తీసుకెళ్లారని, తీవ్రంగా కొట్టి పడిపోయాక తన మరిదికి ఫోన్ చేసి పిలిపించారని చెబుతోంది. మరిది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్తను బైకుపై తీసుకొచ్చాడని, మార్గమధ్యంలో తనను మూడు లాఠీలు విరిగేలా కొట్టారంటూ మరిదితో తన భర్త చెప్పుకుని బాధపడ్డాడంటూ కన్నీటిపర్యంతమైంది. తానిక బతకనని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఏడ్చిన 10 నిమిషాల్లోనే రాచర్లలోని చిన్న ఆస్పత్రిలో చనిపోయాడని రమణమ్మ భోరున విలపించింది. తనకు, తన ఇద్దరు కుమార్తెలకు దిక్కెవరంటూ ఆమె రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. బాలరాజు, సునీతలే తన భర్త చావుకు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. గుండెపోటు వల్లే చనిపోయాడు : సీఐ పోలీస్‌స్టేషన్ నుంచి శనివారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వచ్చాకే రామాంజనేయులు గుండెపోటుతో మృతి చెందినట్లు సీఐ వి.శ్రీరాం తెలిపారు. కాలువపల్లెకు చెందిన మహిళ.. రామాంజనేయులు తనపై లైంగిక దాడికి యత్నించాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. రాచర్ల పోలీసులు రామాంజనేయులును పోలీస్‌స్టేషన్‌కు తీసుకొ చ్చి విచారించారని, విచారణ అనంతరం అతడి తమ్ముడిని పిలిపించి అతడితో ఇంటికి పంపించారన్నారు. ఇందుకు భయపడిన రామాంజనేయులు రాచర్లలోని వైద్యశాలకు వెళ్లాడని, అక్కడ బీపీ ఎక్కువ కావడంతో గుండెపోటుకు గురై మృతి చెందాడని సీఐ వివరించారు. -
పోలీసులపై ముద్రగడ ఫైర్
-కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాకినాడ : ప్రకాశం జిల్లా కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో కాపు వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ బొప్పన పరిపూర్ణచంద్రరావును పోలీసులు అరెస్టు చేసి లాకప్‌డెత్ చేసిన ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. తప్పు చేసిన వ్యక్తిని న్యాయస్థానం ద్వారా శిక్షించాలి తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని లాకప్‌డెత్‌కు పాల్పడటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారే ప్రజల ప్రాణాలు తీయడమేమిటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఆటో నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అపహరించి మూడు రోజులపాటు చిత్రహింసలు పెట్టడమే కాకుండా, కొట్టి చంపడం చూస్తూంటే ఈ ప్రభుత్వమే పథకం ప్రకారమే కాపు సామాజిక వర్గం ప్రతిష్టను దెబ్బతీసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఉందని ఆరోపించారు. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన వ్యక్తిని విచారణ పేరుతో ఎందుకు కారంచేడు తరలించారని ముద్రగడ పోలీసులను ప్రశ్నించారు. లాకప్‌డెత్‌పై ఉన్నత స్థాయి విచారణ జరిపి... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి ముద్రగడ విజ్ఞప్తి చేశారు. పోలీసుల దుశ్చర్యను ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. -
'లాకప్ డెత్ విషయమా.. నాకు తెలీదే'
అనంతపురం: అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో బత్తెన శ్రీరాములు (54) పోలీసుల అదుపులో శుక్రవారం చనిపోయిన సంగతి తెలిసిందే. మండలంలోని ముష్టికోవెల పంచాయతీ గువ్వలగొందిపల్లెకు చెందిన శ్రీరాములును గుప్త నిధుల తవ్వకాల కేసు విచారణలో భాగంగా పోలీసులు నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాములు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. అయితే చెన్నేకొత్తపల్లి లాకప్ డెత్ విషయం తనకు తెలియదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు శనివారం అన్నారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి డీజీపీ రాముడు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్కే విద్యార్థులు ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని.. ఓసీలకు వయోపరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు. -
'అనంత'లో లాకప్ డెత్ !
-
లాకప్ డెత్‌ను దారిమళ్లిస్తున్న టీడీపీ నేతలు!
అనంతపురం : పట్టణంలో చోటుచేసుకున్న లాకప్ డెత్ కేసును పక్కదారి పట్టించేందుకు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరాములు లాకప్ డెత్ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. లాకప్ డెత్ ఘటనలో గాయపడిన మరో ముగ్గురికి రహస్యంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కానీ ఎక్కడ చికిత్స అందిస్తున్నారన్నది, అసలు ఏం జరిగిందన్న విషయాలను వెల్లడించడానికి పోలీసులు, అధికారులు ఇష్టపడటం లేదన్నట్లుగా వారి వ్యవహారం ఉంది. ఈ ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవద్దంటూ ఉన్నతాధికారులపై అధికార పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. -
లాకప్ డెత్ వెనక ?
-
ప్రాణాలు తీస్తున్న పోలీసుల థర్డ్ డిగ్రీ
-
లాకప్‌డెత్‌పై ఎన్నెన్నో అనుమానాలు
పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగిన లాకప్‌డెత్‌పై పలు అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన అశోక్ వెంకట్ మృతిపట్ల పోలీసుల సమాధానాలు అనుమానాలు కలిగిస్తున్నాయి. తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో దిగిన వెంకట్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళ్లాడు? అనే విషయం ఇప్పటికీ మిస్టరిగానే ఉంది. స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తిని సాయంత్రం వరకు పోలీసులు ఎందుకు ఉంచారు? అనే విషయం అంతుచి క్కడం లేదు. ఇటీవల మూడు మా సాల క్రితమే దొంగతనం కేసులో అరెస్టు చేసిన వ్యక్తి వన్ టౌన్ పోలీసులు స్టేషన్లో ఉంచగా చనిపోయాడు. మూడు మాసాల కాలంలోనే ఇద్దరు వ్యక్తులు స్టేషన్లో చనిపోవడం పట్ల అనుమానాలు తావిస్తున్నాయి. మంగళవారం అశోక్‌వెంకటి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్నఎస్పీ దుగ్గల్ వెంటనే సందర్శించి కస్టోడియల్ డెత్‌గా భావిస్తున్నామని, విచారణ జరిపిస్తామని ప్రకటించారు. కాగా బుధవారం అశోక్ వెంకట్ మృ తిపై స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ గంగారామ్, ఆర్డీఓ కిషన్‌రావులు విచారణ జరిపించారు. అశోక్ వెంకట్ సికింద్రాబాద్‌లో వంటలమేస్త్రీగా పని చేస్తాడని, కూతురి వివాహం అనంతరం తిరుపతికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో మిర్యాలగూడలో రై లు దిగినట్లు పేర్కొన్నారు. కానీ రైల్వే స్టేషన్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లినట్లనే విషయం మాత్రం తెలియడం లేదు. కాగా ఇదే విషయంపై గురువారం హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్ కూడా విచారణ చేయనున్నట్టు సమాచారం. వన్‌టౌన్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లినట్లు? మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో కొంత మందితో తగాదా పడితే అశోక్వెంకటిని పోలీసులు తీసుకవచ్చినట్లు తెలిసింది. కానీ రైల్వేస్టేషన్లో తగాదా పడితే రైల్వే పోలీసులు సైతం అక్కడే ఉంటారు. కానీ రైల్వే పోలీసులు ఎందుకు తీసుకెళ్లలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే పోలీసులు తీసుకెళ్లకుంటే రూరల్ పోలీసులు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు తీసుకవచ్చారో తెలియడం లేదు. అశోక్‌వెంకటి మానసిక పరిస్థితి బాగా లేదని చెబుతున్న పోలీసులు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది. కానీ ఆటోలో పంపిస్తే తిరిగి స్టేషన్‌కు వచ్చాడని చెబుతున్నారు. కానీ స్టేషన్ నుంచి బయటకు పంపిన వ్యక్తి తిరిగి స్టేషన్‌కు ఎలా వచ్చాడనే విషయంపై అనుమానాలకు తావిస్తోంది. స్టేషన్‌కు వెళ్తున్న వ్యక్తులను అక్కడ ఉండే గార్డ్ డ్యూటీ పోలీసులు విచారించిన తర్వాతనే లోనికి పంపుతారు. అనామకుడిగా వస్తే అశోక్ వెంకట్‌ను స్టేషన్లో ఎందుకు ఉంచారనే విషయం తెలియాల్సి ఉంది. ఇది రెండో ఘటన ఒక పక్క మైత్రి పోలీసులు అని కార్యక్రమాలు నిర్వహిస్తుంగా మరో పక్క స్టేషన్లో వ్యక్తులు మృతి చెందడంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లోనే మూడు మాసాల కాలంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పట్టణ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.పోలీసులు ప్రజలతో మమేకమై నేరాలను తగ్గించడానికి ఎస్పీ దుగ్గల్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు పోలీసు అధికారులనే సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. లాకప్‌డెత్‌పై విచారణ మిర్యాలగూడ టౌన్ మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం జరిగిన లాకప్‌డెత్‌పై బుధవారం ఆర్డీఓ బి.కిషన్‌రావు, ఏఎస్పీ బి.గంగారాం ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సుమారు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. కాగా మృతుడు అశోక్‌వెంకట్ బంధువులతో పాటు వన్‌టౌన్ పోలీసులను విచారించారు. ఆర్డీఓ బి.కిషన్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎదైనా చెప్పగలుగుతామన్నారు. అదే విధంగా ఆర్డీఓ మృతదేహాన్ని అన్ని కోణాలలో పరిశీలించారు. ఆయన వెంట సూర్యాపేట, మిర్యాలగూడ డీఎస్పీలు బషీర్, సందీప్‌గోనే, సీఐలు సురేందర్‌రెడ్డి, పార్థసారథి తదితరులున్నారు. మృతుడికి భార్య తరాబాయి, కుమారులున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మా నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడు మా నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడని, మతిస్థితిమి తం కూడా బాగేనే ఉందని, వంటలలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మిర్యాలగూడకు ఎందుకు వచ్చాడు అనేది అర్థం కావడం లేదన్నారు. తిరుపతికి వెళ్తున్నానంటూ ఇంట్లో నుంచి వెళ్లిన అశోక్‌వెంకటి మంగళవారం రాత్రి 7గంటలకు చనిపోయాడని పోలీసులు సమాచారం ఇచ్చారని పేర్కొన్నాడు. అతని వెంట బందువులు మాదవ మిట్టల్ పెటెవాల్, ప్రకాశ్వెంకటి, ఆనందం న్నారు. -అశోక్, మృతుడి కుమారుడు -
పీఎస్ లో నిందితుడి అనుమానాస్పద మృతి
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణలో ఉన్న అంతర్ రాష్ట్ర దొంగ అనుమానస్పద స్థితిలో మృతి చెందడం సంచలనానికి దారి తీసింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం సుబ్బారావుపేట గ్రామానికి చెందిన మార్నిడి చక్రధర్‌రావుకు పలు చోరీ కేసుల్లో పాత్ర ఉందంటూ వన్‌టౌన్ పోలీసులు ఈ నెల 22న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఉదయం కస్టడిలోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, అర్ధరాత్రి సమయంలో చక్రధర్‌రావు సొమ్మసిల్లి పడిపోగా పోలీసులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలుపగా... విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఉంటారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
మెదక్ జిల్లాలో లాకప్‌డెత్..!
-
మడకశిర పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్!
అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. బషీర్ అనే యువకుడు పోలీసుల అదుపులో ఉండగా మరణించారు. అతడిని పోలీసులే కొట్టి చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందున్న పూల కుండీలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి పోలీసులను దూషించారు. వివరాల్లోకి వెళితే మడకశిర మండలం కల్లుమర్రికి చెందిన బషీర్ ట్రాక్టర్ ట్రాలీ చోరీ కేసులో గత నాలుగు రోజుల క్రిందట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రతిరోజు అతడిని రాత్రి వేళల ఇంటికి పంపేవారు. అయితే నిన్న రాత్రి లాకప్‌లోనే ఉంచారు. అయితే బషీర్ ఉరి వేసుకుని చనిపోయాడని చెబుతుండగా బంధువులు మాత్రం పోలీసులే చంపారని ఆరోపిస్తూ పీఎస్‌పై దాడికి దిగారు. -
ఎస్ఐ దాడి, వైఎస్ఆర్ సీపీ నేత గుండెపోటుతో మృతి
గిద్దలూరు : ఎస్ఐ దురుసు ప్రవర్తన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుండెపోటుతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఓ వివాదం విషయమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ నేత, గిద్దలూరు సహకార సంఘ అధ్యక్షుడు వైజా విజయ భాస్కర్‌రెడ్డి (48)పై ఎస్ఐ శ్రీనివాసరావు దాడి చేయటంతో ఆయన అక్కడికక్కడే గుండెపోటుతో మరణించారు. స్థానిక హీరో హోండా షోరూం నిర్వాహకుడు తోట సుబ్బారావు, డీఆర్ఆర్ ప్లాజా నివాసి డాక్టర్ హరినాథ్ రెడ్డి మధ్య ఓ విషయమై ఘర్షణ తలెత్తింది. దాంతో ఈ విషయమై ఇరువురు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి భార్యతో ఎస్ఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న వైజా విజయ భాస్కర్‌రెడ్డి పోలీస్ స్టేషన్ చేరుకుని ఎస్ఐ ప్రవర్తను ఖండించారు. దాంతో ఆగ్రహించిన ఎస్ఐ ...భావిజయ భాస్కర్‌రెడ్డిపై దాడి చేసి చేయి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించే లోపే గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి 12.25 గంటల సమయంలో జరిగింది. విషయం తెలిసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అర్థరాత్రి నుంచి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విజయ భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మృతితో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
కోరుట్ల పోలీసు స్టేషన్లో లాకప్ డెత్?
-
కోరుట్ల పోలీసు స్టేషన్లో లాకప్ డెత్?
కరీంనగర్ జిల్లా కోరుట్ల పోలీసు స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. చంద్రయ్య అనే యువకుడు పోలీసుల అదుపులో ఉండగా మరణించాడు. అతడిని పోలీసులే కొట్టి చంపారని చంద్రయ్య బంధువులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం స్టేషన్ పైనుంచి దూకి చనిపోయాడని అంటున్నారు. చంద్రయ్య కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం బుగ్గారం గ్రామవాసి. ధర్మపురి ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన చోరీ కేసులో అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా చంద్రయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులకే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రయ్య పోలీసు స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్ ఎస్పీ శివకుమార్ తెలిపారు. అతడు బ్యాంకు చోరీ కేసులో నేరం ఒప్పుకున్నాడని, అతడి నుంచి తాము రెండున్నర తులాల బంగారం రికవరీ చేశామని ఆయన చెప్పారు. కేసుకు భయపడే పోలీసులను నెట్టి భవనం పైకెక్కి దూకాడని ఆయన అన్నారు. -
స్నేహభావంతోనే శాంతిభద్రతలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజలతో స్నేహంగా మసలుకుంటూ శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులను ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. చెన్నైలో శుక్రవారం నిర్వహించిన ఐపీఎస్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనుమానంపై అరెస్టు చేసిన వారిలో కొందరు లాకప్‌డెత్‌కు గురవడం దురదృష్టకరమన్నారు. వివిధ కేసుల్లో లక్షలాది మందిని అరెస్ట్ చేస్తే వారిలో ఒక్కరు లాకప్‌డెత్‌కు గురైనా సీరియస్‌గా పరిగణించాలన్నారు. అనుమానితులను అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో వారు అనారోగ్యానికి గురికావడం, కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఒక మనిషి ప్రాణాల విలువ అతనిపై ఆధారపడి బతికే ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుందని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో లాకప్‌డెత్‌లు జరగరాదని హెచ్చరించారు. విచారణలో నిర్లక్ష్యం వద్దు నిందితులను పట్టుకుంటే సరిపోదని, వారిపై వచ్చిన ఆరోపణలను రుజువు చే సి శిక్ష పడేలా చూడడం ఎంతో అవసరమని జయలలిత చెప్పారు. ఎందరో నిందితు లు బెయిల్‌పై విడుదలై స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. అరెస్ట్, బెయిల్‌తోనే పోలీసులు సరిపెట్టుకోకుండా సకాలంలో చార్జిషీటు దాఖలు చేస్తే నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీసులపై పని భారం ఉందని, అలాగని సమాజ శ్రేయస్సు, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉదాసీనంగా వ్యవహించ రాదన్నారు. ప్రజలతో పోలీసులు స్నేహితుల్లా మెలగడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. తన ప్రభుత్వం పోలీసు శాఖకు అవసరమైన మేరకు స్వేచ్ఛను ప్రసాదించిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తీవ్రవాదులను తెగించి పట్టుకోవడం ద్వారా తమిళనాడు పోలీసులు వృత్తిపై అంకింతభావాన్ని చాటుకున్నారని తెలిపారు. అందుకే 260 మంది పోలీసులకు నగదు బహుమతులు అందజేసి, పదోన్నతులు కల్పించామని తెలిపారు. నేరాల అదుపు, ట్రాఫిక్ నియంత్రణ, వీవీఐపీలకు బందోబస్తు, ప్రముఖ ప్రదేశాల్లో భద్రత తదితర అన్ని అంశాల్లోనూ పోలీసులు తమ కర్తవ్యాన్ని విడనాడరాదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ తీవ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా తమిళనాడు పోలీస్ శాఖ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. నేరాల అదుపు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అన్ని బాధ్యతల్లో జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. -
తూ.గో. జిల్లాలో లాకప్‌డెత్.. స్టేషన్‌పై దాడితో ఉద్రిక్తత
తాళ్లరేవు, న్యూస్‌లైన్: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి లాకప్ డెత్ జరిగింది. పి.మల్లవరం గ్రామంలో కొందరు పేకాడుతుండగా బుధవారం సాయంత్రం దాడిచేసిన కోరంగి పోలీసులు 9మందిని అరెస్టుచేసి స్టేషన్‌కు తీసుకువచ్చారు. వారిలో ధూళిపూడి కృష్ణ రాత్రి 8 గంటల సమయంలో పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయాడు. విషయం తెలిసిన మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఎస్ఐ ఎం.సాగర్‌బాబును అరెస్టుచేయాలని రాస్తారోకో నిర్వహించారు. కొంతమంది ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్‌యాదవ్, అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ ఎస్పీ కె.సత్యనారాయణ, కాకినాడ రూరల్ సీఐ శరత్‌రాజ్‌కుమార్ కోరంగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఆందోళనకారులు ఎస్ఐని అరెస్టు చేయాల్సిందే ఆందోళన కొనసాగిస్తున్నారు.