అనంతపురం : పట్టణంలో చోటుచేసుకున్న లాకప్ డెత్ కేసును పక్కదారి పట్టించేందుకు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరాములు లాకప్ డెత్ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. లాకప్ డెత్ ఘటనలో గాయపడిన మరో ముగ్గురికి రహస్యంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
కానీ ఎక్కడ చికిత్స అందిస్తున్నారన్నది, అసలు ఏం జరిగిందన్న విషయాలను వెల్లడించడానికి పోలీసులు, అధికారులు ఇష్టపడటం లేదన్నట్లుగా వారి వ్యవహారం ఉంది. ఈ ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవద్దంటూ ఉన్నతాధికారులపై అధికార పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు కనిపిస్తోంది.