
విజయవాడ: నగరంలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని సింగ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నిజం రాబట్టేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారించినట్టు తెలుస్తోంది. పోలీసుల ఇంటరాగేషన్‌లో నిందితుడు సృహ కోల్పొయినట్టు సమాచారం. దీంతో పోలీసులు నిందితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నిందితుడు మృతిచెందాడు. దీంతో గుట్టుచప్పడు కాకుండా, మీడియాకు తెలియకుండా ఈ తతంగాన్ని కానిచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు లాకప్ డెత్‌కు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment