
‘అనంత’లో లాకప్‌డెత్?
అనంతపురం / వజ్రకరూరు (ఉరవ కొండ) : అనంతపురం జిల్లా వజ్రకరూ రులో పోలీసుల అదుపులో ఉన్న ఓ యువకుడు అనుమానాస్ప దస్థితిలో మృ తి చెందాడు. చోరీ కేసులో అనుమా నితుడుగా 3 రోజులుగా పోలీసుల అదు పులో ఉన్న వన్నేష్ (32) మృతదేహం సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్ సమీపంలోని ముళ్లపొదల్లో కనిపించింది.
పోలీసుల విచారణలో చనిపో యాడని ఆరోపిస్తూ అతని బంధువులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. వజ్రకరూరు మండలం ధర్మపురిలో జరిగిన గొర్రెల దొంగతనం కేసులో ఓ ముగ్గురిని పోలీసులు 3 రోజుల కింద తీసుకెళ్లారు. వారిలో వన్నేష్ ఉన్నాడు. అతను శవమై కనిపించడంతో లాకప్‌డెత్‌గా అతని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు తమకు సంబంధం లేదని చెప్తున్నారు.