మరణించిన తండ్రి, కుమారులు
సాక్షి, చెన్నై: తాము ఆడిన సెల్‌ఫోన్లను ఇవ్వలేదన్న ఆగ్రహంతో కక్ష కట్టి జయరాజ్, ఫినిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు గురువారం మీడియా ముందుకు వచ్చిన ఐదు రోజుల క్రితం ఏమి జరిగిందో వివరించారు. ఇక, పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. కాగా, సాత్తాన్ కులం లాకప్‌డెత్‌కు నిరసగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల బంద్‌కు వర్తక లోకం పిలుపునిచ్చింది.(డెత్ వార్)
తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తానుకులంకు చెందిన తండ్రి కుమారులు జయరాజ్, ఫినిక్స్ పోలీస్ కస్టడీలో ఒకరి తర్వాత మరొకరు మరణించడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను వర్తక లోకం తీవ్రంగా పరిగణించింది. తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో నిరసనలు గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది.
మృతదేహాల అప్పగింత....
పోలీసుల మీద హత్య కేసు నమోదు చేసే వరకు మృతదేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని జయరాజ్ కుటుంబం స్పష్టం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు నియమించ బడ్డ మెజిస్ట్రేట్ ఆ కుటుంబంతో గురువారం ఉదయం మాట్లాడారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ, మృతదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు సమాచారం. దీంతో కుటుంబీకులు మృత దేహాలకు అంత్యక్రియలు జరిపేందుకు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి పూర్తి వీడియో చిత్రీకరణ మేరకు జయరాజ్, ఫినిక్స్ మృతదేహాలకు పోస్టుమార్టం జరిగింది. మెజిస్ట్రేట్ హామీ మేరకు మృతదేహాల్ని తీసుకుంటున్నామని ఆ కుటుంబం ప్రకటించింది. లాకప్ డెత్ వివాదంలో కొందరు సాక్షులు ఎమి జరిగిందో మీడియా దృష్టికి తెచ్చారు.
విచారణలకు బ్రేక్..
సాత్తాన్ కులం వివాదం నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఐజీ, డీఐజీలకు డీజీపీ త్రిపాఠి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేని కీలక కేసులు ఇకమీద పోలీసుల స్టేషన్లలో విచారించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. డీఎస్పీ లేదా, డీఐజీ కార్యాలయాల్లో విచారణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
నేడు వర్తక బంద్.... జయరాజ్, ఫినిక్స్‌లను కొట్టి చంపిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా , పోలీసుల వేదింపులకు చెక్‌పెట్టే విధంగా వర్తక లోకం ఏకమైంశుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment