
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా విచారణను కొనసాగించింది. విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని పోలీస్ అకాడెమీలో ఉన్న ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల ముందు షాద్‌నగర్ సీఐ శ్రీధర్ హాజరయ్యారు. ఇక దిశ హత్యకేసు నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన బంక్ యజమాని ప్రవీణ్‌ను కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు విచారించనున్నారు. ఇదిలాఉండగా.. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం మంగళవారం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది.
(చదవండి : చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ కేసులో కీలక మలుపు)
(చదవండి : ఎన్‌కౌంటర్‌పై గాయపడ్డ పోలీసుల వెర్షన్!)
Comments
Please login to add a commentAdd a comment