ట్రవిస్‌ హెడ్‌ విధ్వంసం.. సఫాలను ఊడ్చేసిన కంగారూలు  | AUS VS SA 3rd T20: Australia Beat South Africa By 5 Wickets, Clean Sweeps The Series | Sakshi
Sakshi News home page

AUS VS SA 3rd T20: ట్రవిస్‌ హెడ్‌ విధ్వంసం.. సఫాలను ఊడ్చేసిన కంగారూలు 

Published Sun, Sep 3 2023 9:10 PM | Last Updated on Sun, Sep 10 2023 3:42 PM

AUS VS SA 3rd T20: Australia Beat South Africa By 5 Wickets, Clean Sweeps The Series - Sakshi

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 0-3 తేడాతో కోల్పోయింది. డర్బన్‌ వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 3) జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్‌ 3-0 తేడాతో ప్రొటీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది.

అరంగేట్రంలోనే అదరగొట్టిన ఫెర్రెయిరా 
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (30 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ మార్క్రమ్‌ (23 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అరంగేట్రం ఆటగాడు డొనొవన్‌ ఫెర్రెయిరా (21 బంతుల్లో 48; ఫోర్‌, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 

ఆఖర్లో ఫెర్రెయిరా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (16 బంతుల్లో 25; ఫోర్‌, 2 సిక్సర్లు)తో పాటు సిక్సర్ల వర్షం కురిపించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ 4 వికెట్లు పడగొట్టగా.. మార్కస్‌ స్టోయినిస్‌ 2, తన్వీర్‌ సంగా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

హెడ్‌, ఇంగ్లిస్‌, స్టొయినిస్‌ల ఊచకోత..
191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. ట్రవిస్‌ హెడ్‌ (48 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్‌ ఇంగ్లిస్‌ (22 బంతుల్లో 42; ఫోర్‌, 4 సిక్సర్లు), మార్కస్‌ స్టోయినిస్‌ (21 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 17.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. భీకర ఫామ్‌లో ఉండిన కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (15) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 

కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఆసీస్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తదుపరి 5 మ్యాచ​్‌ల వన్డే సిరీస్‌ జరుగనుంది. సెప్టెంబర్‌ 7, 9, 12, 15, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement