2019 వరల్డ్‌కప్ విన్నింగ్ హీరో, ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు స్టోక్స్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో వన్డేలతో పాటు వరల్డ్‌కప్‌కు ప్రకటించిన ఇంగ్లండ్ ప్రిలిమనరీ జట్టులో స్టోక్స్‌కు చోటుదక్కింది.
ఇక ఇది ఇలా ఉండగా.. స్టోక్స్ తన నిర్ణయాన్ని మార్చుకోవడాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ తప్పుపట్టాడు. స్టోక్స్ యూటర్న్ తీసుకోవడంతో ఒక ఆటగాడు ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడని పైన్ అభిప్రాయపడ్డాడు. "బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అతడు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఎందుకంటే ప్రపంచకప్ వంటి టోర్నీలో ఆడేందుకు ఆటగాళ్లు దాదాపు ఏడాది నుంచి కష్టపడతున్నారు.
అటువంటిది సడన్‌గా మనసు మార్చుకోని వరల్డ్‌కప్ వంటి పెద్దటోర్నీలో ఆడుతానంటే ఎలా కుదురుతుంది? ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఆడాలని కలలు కన్న ఆటగాళ్లు బెంచ్‌లో కూర్చోవాలా? అంటూ పైన్ ప్రశ్నలవర్షం కురిపించాడు. అదే విధంగా ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు.
ఇదే విషయంపై పైన్ మాట్లాడుతూ.. స్టోక్స్ బౌలింగ్ చేస్తాడో లేదో నాకు తెలియదు. కేవలం బ్యాటర్‌గా అయితే సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం 100 శాతం తప్పు అవుతోంది. స్టోక్స్ కోసం హ్యారీ బ్రూక్‌ను బలిచేశారు. అది సరైన నిర్ణయం కాదు. ఎందకంటే బ్రూక్స్ మిడిలార్డర్‌లో అద్బుతంగా రాణిస్తున్నడని అతడు పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment