
ముంబై : ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్ బంగారంలాంటి అవకాశం కోల్పోయాడని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ పేర్కొంది. భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పైన్ తన నోటికి పనిచెబుతూ రోహిత్‌ను కవ్వించిన విషయం తెలిసిందే. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని ఏకాగ్రతను దెబ్బతీసేలా సిక్స్ కొడితే ముంబై జట్టుకి మారిపోతానని రెచ్చగొట్టాడు. వీటిని పట్టించుకోని హిట్‌మ్యాన్.. నిలకడగా తన బ్యాటింగ్ కొనసాగించాడు. అనంతరం ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. టిమ్‌పైన్‌కు మంచి ఆఫర్ ఇచ్చాడు. ‘పైన్ ముంబై అభిమానిలా కనిపిస్తున్నాడు.. మూడో టెస్ట్‌లో సెంచరీ చేస్తే ముంబై జట్టులోకి తీసుకుంటాం’ అని తెలిపాడు.
అయితే ఈ వ్యాఖ్యలనే కోట్ చేస్తూ ముంబై ఇండియన్స్ జట్టు తమ అధికారిక ట్విటర్‌లో పైన్ మంచి అవకాశాన్ని కోల్పోయాడని పోస్ట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పైన్ 26(67 బంతులు) జడేజా బౌలింగ్‌లో రిషభ్ పంత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ టిమ్ పైన్ మిషన్ ఫెయిల్ అయిందంటూ ట్వీట్ చేసింది.
”If he (Paine) gets a hundred here, I will put in a word about him to my boss at Mumbai Indians and we'll buy him. Looks like he's a fan of Mumbai." - @ImRo45
— Mumbai Indians (@mipaltan) December 29, 2018
Tim Paine: c Pant b Jadeja - 26 (67) #CricketMeriJaan #AUSvIND pic.twitter.com/c36xdjZRYW
Comments
Please login to add a commentAdd a comment