Tim Paine Announces Resignation as Australian Test Cricket Captain - Sakshi
Sakshi News home page

Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్‌ కెప్టెన్సీకి రాజీనామా

Published Fri, Nov 19 2021 12:04 PM | Last Updated on Fri, Nov 19 2021 7:00 PM

Tim Paine Announces Resignation as Australian Test Cricket Captain - Sakshi

Tim Paine Announces Resignation as Australian Test Cricket Captain Over Private Text Exchange:  యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు టెస్ట్‌ కెప్టెన్‌ టిమ్ పైన్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఓ మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపడాన్న ఆరోపణల నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి పైన్‌ తప్పుకున్నాడు.  "ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నా నిర్ణయాన్ని ఈరోజు ప్రకటిస్తున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ నాకు, నా కుటుంబానికి, మాజట్టుకు  సరైన నిర్ణయం” అని టిమ్ పైన్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. 2017 లో తన సహోద్యోగికు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు అతడు వెల్లడించాడు.

ఈ సంఘటనపై విచారణ జరుగుతుందిని, ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నాని టిమ్‌ పైన్‌ తెలిపాడు.  ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా  ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. "టిమ్ పైన్ ఆస్ట్రేలియా పురుషుల టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనిపై మరింత సమాచారం​ త్వరలో అందిస్తాం అని  క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. కాగా 2017లో ఓ మహిళకు అసభ్యకరమైన రీతిలో మేసేజ్‌లు పంపాడాన్న ఆరోపణలు  పైన్‌పై వచ్చాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన  క్రికెట్ ఆస్ట్రేలియా.. నిజమేనని ధృవీకరించింది. కాగా యాషెస్‌ సిరీస్‌ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement