Reports: Australian Selectors Approach Steve Smith Test Captain Again - Sakshi
Sakshi News home page

Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్‌ స్మిత్‌!

Published Sat, Nov 20 2021 5:08 PM | Last Updated on Sat, Nov 20 2021 7:52 PM

Reports: Australian Selectors Approach Steve Smith Test Captain Agian - Sakshi

Cricket Australia Confirms Steve Smith To Replace Tim Paine As Test Captain.. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా స్మిత్‌ను సంప్రదించినట్లు రిపోర్ట్స్‌లో వెల్లడైంది. ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌గా ఉన్న పాట్‌ కమిన్స్‌ ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ అయ్యే అవకాశాలే ఎక్కువని జోరుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా స్మిత్‌ పేరు మరోసారి బయటికి రావడంతో ఆసక్తి నెలకొంది.

చదవండి: Pat Cummins : ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్..!

కాగా స్టీవ్‌ స్మిత్‌ 2015-18 కాలంలో ఆస్ట్రేలియాకు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మంచి విజయాలు అందుకుంది. అయితే 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోటెస్టు మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం స్మిత్‌ కెరీర్‌ను పాతాళంలోకి నెట్టింది. బెన్‌క్రాప్ట్‌తో కలిసి వార్నర్‌, స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ చేశారని నిరూపితం కావడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా సీరియస్‌ చర్యలు తీసుకుంది. స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేదం.. బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు బహష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు స్మిత్‌ ఒక ఏడాది పాటు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టకూడదంటూ మరో నిర్ణయం తీసుకుంది. ఇక నిషేధం ముగిసిన తర్వాత జట్టులోకి వచ్చిన స్మిత్‌ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌ ఆటగాడిగా ఉన్నాడు.

చదవండి: యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్‌.. వరల్డ్‌కప్‌ హీరోకు నో ఛాన్స్‌

ఇక 2017లో ఆటగాడిగా ఉన్న సమయంలో మహిళతో అసభ్యకర చాటింగ్‌ చేశాడని టిమ్‌ పైన్‌పై ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనని ఒప్పుకున్న టిమ్‌ పైన్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. కీలకమైన యాషెస్‌ సిరీస్‌కు ముందు పైన్‌ కెప్టెన్సీ వదిలేయడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేదానిపై తర్జనభర్జనలో ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డులో ఉన్న పలువురు అధికారులు స్మిత్‌ పేరును ప్రతిపాదించారు. కెప్టెన్‌గా కమిన్స్‌ వద్దనుకుంటే ప్రత్యామ్నాయంగా స్మిత్‌ కనిపిస్తున్నాడని.. పైగా అతనికి టెస్టుల్లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉందని వారు పేర్కొన్నారు.

చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్‌ కెప్టెన్సీకి రాజీనామా

ఒకవేళ అన్ని కలిసివస్తే స్టీవ్‌స్మిత్‌ను మరోసారి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా చూసే అవకాశం ఉంది. స్టీవ్‌ స్మిత్‌ టెస్టు కెప్టెన్‌గా 34 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 18 విజయాలు.. 10 పరాజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా టెస్టు కెప్టెన్‌గా స్మిత్‌కు 52.9% సక్సెస్‌ ఉండడం విశేషం. 2010లో ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన స్టీవ్‌ స్మిత్‌ 77 టెస్టులు, 128 వన్డేలు, 52 టి20లు ఆడాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement