Nathan Lyon Supports Tim Paine Want Best Wicketkeeper in World Team - Sakshi
Sakshi News home page

Nathan Lyon- Tim Paine: టిమ్‌ పైన్‌ బెస్ట్‌ వికెట్‌ కీపర్‌.. తను జట్టులో ఉండాలి.. బౌలర్‌గా నా స్వార్థం ఇది!

Published Thu, Nov 25 2021 12:50 PM | Last Updated on Thu, Nov 25 2021 2:21 PM

Nathan Lyon Supports Tim Paine Want Best Wicketkeeper in World Team - Sakshi

Nathan Lyon Said Tim Paine Want the World Best Wicketkeeper in Team: మహిళకు అసభ్య సందేశాలు పంపాడన్న ఆరోపణల నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా టెస్టు మాజీ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌కు సహచర ఆటగాడు నాథన్‌ లియాన్‌ మద్దతుగా నిలిచాడు. కేవలం ఆస్ట్రేలియాలోనే కాకుండా... ప్రపంచం మొత్తంలో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ టిమ్‌ అని కొనియాడాడు. అతడు డ్రెస్సింగ్‌రూంలో ఉంటే వాతావరణం బాగుంటుందన్నాడు. అంతేతప్ప పైన్‌ కారణంగా ఆటగాళ్ల దృష్టి ఇతర విషయాలకు మళ్లుతుందనుకోవడం సరికాదని చెప్పుకొచ్చాడు. 

కాగా 2017లో ఓ మహిళకు అభ్యంతరకర మెసేజ్‌లు పంపినట్లు అంగీకరించిన పైన్‌.. టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు ముందు ఈ మేరకు ప్రకటన చేయడంతో.. జట్టులో అతడికి చోటు ఉంటుందా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతడు గనుక జట్టుతో చేరితే ఇటీవల పరిణామాల ప్రభావం ఇతర ఆటగాళ్లపై పడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ మట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో దేశంలోనే కాదు.. ప్రపంచంలో కూడా అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ టిమ్‌. ఆసీస్‌ డ్రెస్సింగ్‌రూంలో వందకు వంద శాతం తనకు మద్దతు లభిస్తుందని నమ్ముతున్నా. తన కారణంగా మా దృష్టి మళ్లుతుందనడం సరికాదు. మేము ప్రొఫెషనల్‌ ఆటగాళ్లం. మా పని క్రికెట్‌ ఆడటం మాత్రమే. 

ఇతర విషయాలను పట్టించుకోము. ఆటగాళ్లుగా మా విధులేమిటన్న అంశంపై మాత్రమే దృష్టి సారిస్తాం’’ అని క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు. ఇక సెలక్షన్‌కు తాను అందుబాటులో ఉంటానని పైన్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో...  బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ జట్టులోకి రావాలని తాను కోరుకుంటానని, ఒక బౌలర్‌గా ఇది తన స్వార్థమని చెప్పుకొచ్చాడు. 

చదవండి: IPL 2022 Auction- KL Rahul: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌..! ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధం?
IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్‌ కల.. దిగ్గజ క్రికెటర్‌ చేతుల మీదుగా క్యాప్‌.. వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement