మెల్‌బోర్న్: ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత జట్టు మోసం చేసి గెలిచిందని, రెండేళ్ల కిందట కోహ్లి సాధారణ ఆటగాడు మాత్రమేనని, అతన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆసీస్ టెస్ట్ సారధి టిమ్ పైన్.. మాట మార్చాడు. అతని వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రపంచపు అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని కొనియాడాడు.
అసలుసిసలైన పోటీతత్వం కలిగినకోహ్లిని కలకాలం గుర్తుంచుకుంటానన్నాడు. కోహ్లితో పోటీ ఎప్పటికీ మజానిస్తుందని పేర్కొన్నాడు. కోహ్లి లాంటి ఆటగాడు జట్టులో ఉండాలని ఏ కెప్టెన్ అయినా కోరుకుంటాడని తెలిపాడు. మైదానంలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు ఆటలో భాగమని, తాము దాన్ని ఆస్వాధిస్తామని వెల్లడించాడు. కాగా టిమ్ పైన్, కోహ్లిల మధ్య నాలుగేళ్ల క్రితం ఓ మ్యాచ్‌లో వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీలో టీమిండియా ఈ ఏడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
చదవండి: బట్లర్ జట్టులో విధ్వంసకర వీరులకు దక్కని చోటు
Comments
Please login to add a commentAdd a comment