Pat Cummins to take over Australias captaincy for the Ashes - Sakshi
Sakshi News home page

Pat Cummins : ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్..!

Published Sat, Nov 20 2021 12:08 PM | Last Updated on Sat, Nov 20 2021 12:59 PM

Pat Cummins certain to take over Australias captaincy for the Ashes - Sakshi

Pat Cummins certain to take over Australias captaincy for the Ashes:  ఓ మహిళకు అసభ్యకర సందేశాలు పంపాడన్న ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రేలియా టెస్ట్‌  కెప్టెన్సీ బాధ్యతల నుంచి టిమ్‌పైన్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. పైన్‌ రాజీనామా నేపథ్యంలో కొత్త సారథి ఎవరన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

అదేవిధంగా ఆసీస్‌ టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ను నియమించే అవకాశం ఉంది. ఇక ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే టిమ్‌పైన్‌ సారథ్యంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో కమిన్స్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టిమ్‌ పైన్‌కు జట్టులో స్థానం ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

ఒక వేళ కమిన్స్‌ ఆసీస్‌ సారథ్య బాధ్యతలు చేపడితే అది ఒక చరిత్ర కానుంది. ఎందుకంటే 1964 తర్వాత నుంచి  ఆస్ట్రేలియా కు  ఒక బౌలర్ ఆ జట్టుకు కెప్టెన్సీ చేపట్టలేదు. 1964లో ఆసీస్‌ కెప్టెన్‌గా ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌గా రిచి బెనాడ్ బాధ్యతలు చేపట్టాడు. ఇక కమిన్స్‌ చరిత్రను తిరిగి రాయనున్నాడో లేదో వేచి చూడాలి.

చదవండి: IND Vs NZ 2nd T20 : రోహిత్‌ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement