
సిడ్నీ : ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో కెప్టెన్‌గా వైదొలిగిన స్టీవ్ స్మిత్ స్థానంలో పైన్ కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిమ్ పైన్ సారథ్యంలో భారత జట్టుకు టెస్టు సిరీస్ కోల్పోయినా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ను నిలబెట్టుకున్నామాని లియోన్ తెలిపాడు. నాథన్ లియోన్ మాట్లాడుతూ.. ' మా జీవితంలో బాల్ ట్యాంపరింగ్ వివాదం ఎప్పటికి వెంటాడుతుంది. అలాంటి సమయంలో కష్టకాలంలో ఉన్న జట్టును తన నాయకత్వ ప్రతిభతో మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు పైన్ ప్రయత్నించాడు. కెప్టెన్‌గా టిమ్ పైన్ తన విశ్వసనీయతను కాపాడుకుంటునే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అతని నిజాయితీయే పైన్‌ను ఏదో ఒకరోజు ఉత్తమ కెప్టెన్‌గా నిలబెడుతుంది. రోజు రోజుకు కెప్టెన్సీలో పైన్ మరింత రాటు దేలుతున్నాడు' అంటూ ప్రశంసలు కురిపించాడు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అన్ని క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా జూన్ నెలకు వాయిదా వేసింది.
(కరోనాతో మాజీ క్రికెటర్ మృతి)
Comments
Please login to add a commentAdd a comment