Alex Carey Test Debut By Ashes Series Repalces Tim Paine.. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల ఆటగాడు.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. కీలకమైన యాషెస్ సిరీస్ ద్వారా అలెక్స్ క్యారీ ఎంట్రీ ఇవ్వనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 8 నుంచి మొదలుకానున్న యాషెస్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా మొదటి రెండు టెస్టులు ఆడనున్న జట్టును ఎంపికచేసింది. 15 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహించనుండగా.. స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక సెక్స్ స్కాండల్ ఆరోపణలతో కెప్టెన్సీ వదులుకున్న టిమ్ పైన్ యాషెస్ సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పైన్ స్థానంలో ఎంపికైన అలెక్స్ క్యారీ ఆసీస్ తరపున 461వ టెస్టు ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.
చదవండి: Steve Smith: 'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్‌రూం అద్దానికి అంటించా'
ఇదే విషయమై ఆస్ట్రేలియన్ క్రికెట్ సెలక్టర్స్ చైర్మన్ జార్జ్ బెయిలీ మాట్లాడాడు. '' పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అలెక్స్ క్యారీ రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. వికెట్ కీపర్‌గా.. బ్యాటర్‌గా సక్సెస్ అయిన అలెక్స్ క్యారీ టెస్టుల్లోనూ అదే రీతిలో ఆడుతాడనే నమ్మకముంది. అతని దూకుడైన ఆటతీరు జట్టుకు ఇప్పుడు చాలా అవసరం. పైన్ స్థానంలో అతన్ని ఎంపికచేశాం. ఆసీస్ తరపున 461 వ టెస్టు ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వనున్న క్యారీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాడని భావిస్తున్నాం.'' అని చెప్పుకొచ్చాడు. ఇక అలెక్స్ క్యారీ ఆస్ట్రేలియా తరపున 45 వన్డేల్లో 1203 పరుగులు.. 38 టి20ల్లో 233 పరుగులు సాధించాడు.
చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా
తొలి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్) అలెక్స్ కారీ, కామెరున్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రేవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నేజర్, జై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్వెప్సన్
Comments
Please login to add a commentAdd a comment