
శుక్రవారం ఆట ముగిశాక, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మీడియా సమావేశంలో ఉండగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే... పైన్ మాటలను రికార్డు చేసేందుకు జర్నలిస్టు ఒకరు తన ఫోన్‌ను అతడి ముందు పెట్టాడు. ఈలోగా ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పైన్ ఏమాత్రం సంకోచించకుండా ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ‘నేను టిమ్ పైన్ మాట్లాడుతున్నా.
అటు ఎవరు’? అని ప్రశ్నించాడు. దీనికి ‘హాంకాంగ్ నుంచి క్యాసీని మాట్లాడుతున్నా. మీరెవరంటూ?’ సమాధానం వచ్చింది. అనంతరం ‘మీకు మార్టిన్ కావాలా? అతడు మీడియా సమావేశంలో ఉన్నాడు. నేను అతడితో మీకు కాల్ చేయించవచ్చా?’ అని పైన్ అడగ్గా... ‘మెయిల్స్ చెక్ చేసుకోమనండి’ అని జవాబిచ్చాడు. ఈ విషయం మార్టిన్‌కు చెబుతానని పైన్ నవ్వుతూ సంభాషణను ముగించాడు.