
సిడ్నీ : ‘హలో నేను టిమ్‌పైన్ మాట్లాడుతున్నా..’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్రెస్ మీట్ మధ్యలో ఓ జర్నలిస్ట్ ఫోన్‌కు సమాధనమివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత్‌తో చివరి టెస్ట్ సందర్భంగా రెండో రోజు ఆట అనంతరం టిమ్ పైన్ మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో భారీస్కోర్‌తో భారత్ ఆదిపత్యం చలాయించినప్పటికి.. టిమ్ పైన్ మాత్రం ఒత్తిడిని దరిచేరనీయ లేదు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు టిమ్ పైన్ సీరియస్‌గా సమాధానాలు చెబుతున్న సమయంలో ఓ మొబైల్ ఫోన్ మోగింది.
దీంతో ఈ ఫోన్ ఎవరిది అంటూ టిమ్ ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ‘నేను టిమ్‌పైన్ మాట్లాడుతున్నా.. మీకు ఎవరు కావాలి’? అంటూ అడిగాడు. దానికి అవతలి వ్యక్తి తన పేరు కేసీ అని, తనకు మార్టిన్ కావాలని అడిగింది. అతడు ప్రెస్‌మీట్‌లో మధ్యలో ఉన్నాడని, తర్వాత అతనితో కాల్ చేయిస్తానని పైన్ చెప్పాడు. ఒక్కసారి అతన్ని మెయిల్ చెక్ చేసుకోమని కేసీ చెప్పడంతో అలాగే అంటూ టిమ్ పైన్ ఫోన్ పెట్టేశాడు. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో ఓ జర్నలిస్ట్‌కు వచ్చిన ఫోన్ కాల్ లిప్ట్ చేసి టిమ్ పైన్ మాట్లాడటం చూసి అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment