‘భారత్‌కు వచ్చినప్పుడు చూపిస్తా’ | Ashwin Responds In Style After Paine Sledges | Sakshi
Sakshi News home page

‘భారత్‌కు వచ్చినప్పుడు చూపిస్తా’

Published Tue, Jan 12 2021 10:24 AM | Last Updated on Tue, Jan 12 2021 10:24 AM

Ashwin Responds In Style After Paine Sledges - Sakshi

పాపం...ఆసీస్‌ కెప్టెన్‌ పైన్‌కు ఏదీ కలిసి రాలేదు. గెలవాల్సిన మ్యాచ్‌ చేజారాక అందులో తాను మూడు క్యాచ్‌లు వదిలేయడం అతని బాధను రెట్టింపు చేసింది. పంత్‌ 3, 56 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌లను వదిలేసిన కెప్టెన్‌ చివర్లో విహారి క్యాచ్‌ను కూడా జారవిడిచాడు. చివర్లో అసహనం పెరిగిపోవడంతో అతను అశ్విన్‌ను స్లెడ్జింగ్‌ చేసే ప్రయత్నం చేసి భంగపడ్డాడు. ‘బ్రిస్బేన్‌లో నీ కోసం ఎదురు చూస్తుంటా’ అంటూ అశ్విన్‌ను రెచ్చగొట్టడంతో ‘భారత్‌లో కూడా నీ కోసం ఎదురు చూస్తా. అదే నీకు చివరి సిరీస్‌ అవుతుంది’ అంటూ అశ్విన్‌ ఘాటుగా బదులిచ్చాడు. దాంతో మరింత ఆగ్రహంగా ‘నాపై నా జట్టుకు నమ్మకముంది’ అంటూ బూతును ప్రయోగించాడు. అయితే ఏం చేసినా అశ్విన్‌ ఏకాగ్రతను భంగపర్చలేకపోయాడు. విహారి జతగా ఔట్‌ కాకుండా అజేయంగా నిలిచిన అశ్విన్‌ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement