
టీమిండియా సారథి విరాట్ కోహ్లి అసాధారణ ఆటగాడంటూ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా స్మిత్, కోహ్లిలు గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. స్మిత్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లి అసాధారణ ఆటగాడని, అన్ని ఫార్మాట్‌లలో అతడు సాధించిన రికార్డులు అమోఘమని కొనియాడాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి భవిష్యత్తులో మరిన్నో కొత్త రికార్డులు సృష్టిస్తాడని స్మిత్ అభిప్రాయపడ్డాడు. కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా జట్టును నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చాడని అన్నారు.
ఈ ఏడాది జరగబోయే టీ 20 ప్రపంచకప్‌లో గెలుపు కోసం టీమిండియా ఆటగాళ్లు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తారని స్మిత్ అభిప్రాయపడ్డారు. ఆసీస్‌టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ నాయకత్వంలో ఆసీస్ జట్టు అద్భుత విజయాలను సాధించిందని అన్నారు. యాషెస్ సిరీస్‌లో పైన్ కీలక పాత్ర పోషించాడని అన్నారు. ప్రస్తుతం నాలుగు రోజుల టెస్ట్ గురించి చర్చ జరుగుతుందని.. కానీ తాను మాత్రం ఐదు రోజుల టెస్ట్ క్రికెట్‌నే ఇష్టపడతానని స్మిత్ అన్నాడు.
చదవండి: అది భారత్‌కు ఎంతో అవమానకరం: అక్తర్
Comments
Please login to add a commentAdd a comment