బెన్ స్టోక్స్- టిమ్ పైన్ (PC: Twitter)
Ben Stokes' ODI Retirement Backflip For WC 2023: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అండగా నిలిచాడు. స్టోక్స్‌పై విమర్శలు గుప్పించిన ఆస్ట్రేలియా మాజీ సారథి టిమ్ పైన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. చెత్త సలహాలు మానుకోవాలంటూ హితవు పలికాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2019 హీరో స్టోక్స్ ఇటీవలే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
హీరో వచ్చేస్తున్నాడు..
మెగా ఈవెంట్ నేపథ్యంలో అతడిని మళ్లీ వన్డేల్లో ఆడించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో స్టోక్స్ బరిలోకి దిగనుండటంతో హర్షం వ్యక్తం చేశారు.
అయితే, స్టోక్స్ యూటర్న్‌పై ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ స్పందించిన తీరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. SEN టాస్మానియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డేల్లో రిటైర్మెంట్‌పై బెన్ స్టోక్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆసక్తి కలిగించింది.
మీరు బెంచ్‌పై కూర్చోండి!
అంటే ప్రతిచోటా నేనే.. నేనే.. నేనే అన్నట్లుగా ఉంది కదా! నాకు ఇష్టం వచ్చినపుడు ఆడతా.. అది కూడా మేజర్ ఈవెంట్లలో మాత్రమే ఆడతా అంటే.. ఏడాది పాటు కష్టపడ్డ ఆటగాళ్లు ఎక్కడికిపోవాలి?
ఇప్పుడు నేను ఆడతాను.. మీరు బెంచ్‌కే పరిమితం కావాలి అని వాళ్లకు చెప్తాడా?’’ అంటూ స్టోక్స్ స్వార్థపరుడన్న ఉద్దేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో టిమ్ పైన్ మాటలు నెట్టింట వైరల్ కాగా మైకేల్ వాన్ తనదైన శైలిలో స్పందించాడు.
టిమ్‌కు కౌంటర్ ఇచ్చిన వాన్
‘‘ఇంతవరకు బెన్ స్టోక్స్ లాంటి నిస్వార్థపరుడైన క్రికెటర్‌ను నేనింత వరకు చూడలేదు. తనకంటే జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తాడు. మిగతా ఏ క్రికెటర్‌తో పోల్చినా ఈ విషయంలో తనే ముందుంటాడు.
టిమ్.. ఇలాంటి హాస్యాస్పద సలహాలు ఇవ్వడం మానుకో!’’ అంటూ దిమ్మతిరిగే ట్వీట్‌తో టిమ్ పైన్‌కు కౌంటర్ వేశాడు. కాగా 32 ఏళ్ల స్టోక్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 105 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 2924 పరుగులు చేశాడు.
ఎవరిపై వేటు?
ఇందులో మూడు సెంచరీలు, 21 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక ఈ ఫార్మాట్లో ఈ రైట్ ఆర్మ్ పేసర్ మొత్తంగా 74 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 5- వికెట్ హాల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. స్టోక్స్ రీఎంట్రీతో ఎవరిపై వేటు పడనుందన్న అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయమైంది.
చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్‌లో మలింగ రీఎంట్రీ! అతడి స్థానంలో..
Ben stokes is the most selfless cricketer I have ever known .. He puts Team before himself more than any other player .. Ridiculous suggestion from Tim .. https://t.co/jUXwzl1z2e
— Michael Vaughan (@MichaelVaughan) August 19, 2023
Comments
Please login to add a commentAdd a comment