చెలరేగిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు.. పాక్‌ టార్గెట్‌ 338 పరుగులు | Eng vs Pak WC 2023: England strikes in final game, scores 337 - Sakshi
Sakshi News home page

WC 2023 PAK vs ENG: చెలరేగిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు.. పాక్‌ టార్గెట్‌ 338 పరుగులు

Published Sat, Nov 11 2023 6:06 PM | Last Updated on Sat, Nov 11 2023 6:13 PM

England vs Pakistan WC: England strikes in final game, post 337 - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు తమ బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా వేదికగా పాకిస్తాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ స్టోక్స్‌(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్‌ ఆడగా.. జోరూట్‌(60), జానీ బెయిర్‌ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్‌(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), డేవిడ్‌ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15) మెరుపులు మెరిపించాడు.  పాకిస్తాన్‌ బౌలర్లలో హ్యారీస్‌ రవూఫ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్‌ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇఫ్తికర్‌ అహ్మద్‌కు ఒక వికెట్‌ దక్కింది.
చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్‌ ఆజం గుడ్‌బై..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement