Australia Postpone First Ever Test Match Against Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నవంబర్ 27 నుంచి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. దేశంలో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మహిళల క్రీడలపై నిషేధం విధించారు. దీంతో ఆస్ట్రేలియా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహిళా క్రికెట్‌పై నిషేధం కొనసాగితే టెస్టును రద్దు చేయాలని ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్లుఘా దేశ క్రికెట్ బోర్డును సూచించినట్లు సమాచారం.
"ప్రస్తుత అనిశ్చితి దృష్ట్యా ఆఫ్ఘాన్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ నిర్వహించడం సరికాదని మేం భావిస్తున్నాం. అందకే ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో చర్చల తర్వాత టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేయాలాని నిర్ణయించకున్నాము. ఆఫ్ఘనిస్తాన్‌లో పురుషులు, మహిళల క్రికెట్ అభివృద్దికి ఆస్ట్రేలియా ఎప్పడూ కట్టుబడి ఉంటుంది" అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
ఆస్ట్రేలియా నిర్ణయంపై ఆఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ నబీ స్పందించాడు. ఈ ఏడాది టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది అని తెలిపాడు. "ఈ సంవత్సరం టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది, అయితే మ్యాచ్ వాయిదా మాత్రమే వేయబడింది. పూర్తిగా రద్దు కానుందున నేను సంతోషంగా ఉన్నాను" అని నబీ పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2021 NZ Vs NAM: కివీస్ బౌలర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
Comments
Please login to add a commentAdd a comment