ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ గ్లెన్ మాక్స్‌వెల్ ఓ వివాదంలో చికుకున్నాడు. జనవరి 19న ఆసీస్ క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్న ‘‘సిక్స్ అండ్ అవుట్’’ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి లేకుండానే మాక్స్‌వెల్ పాల్గోనున్నాడు. అంతేకాకుండా ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు.
పీకల దాగా తాగిన మాక్స్‌వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కాగా ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది. అయితే తాజాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన ఆసీస్ జట్టులో మాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు.
విండీస్‌తో టీ20ల దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇచ్చారు. అంతే తప్ప అతడిని జట్టు నుంచి తప్పించడానికి పబ్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు మాక్స్‌వెల్ కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే జట్టును ఫైనల్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో మెల్‌బోర్న్ కెప్టెన్సీ నుంచి మాక్సీ తప్పుకున్నాడు.
చదవండి: SA20 2024: జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే.. కట్‌చేస్తే.. 52 పరుగులకే ఆలౌట్!
Comments
Please login to add a commentAdd a comment