అతను వార్నర్‌ కాదు.. డేవిడ్‌ ఖాన్ అట‌! | Watch Hillarious Video Of David Warner As Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

అతను వార్నర్‌ కాదు.. డేవిడ్‌ ఖాన్ అట‌!

Published Wed, Dec 23 2020 1:45 PM | Last Updated on Wed, Dec 23 2020 5:43 PM

Watch Hillarious Video Of David Warner As Shah Rukh Khan  - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఇండియన్‌ హీరోలను ఇమిటేట్‌ చేయడంలో ముందువరుసలో ఉంటాడు. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉన్న వార్నర్‌ చాలా ఇండియన్‌ సినిమాల డైలాగ్‌లను, హీరో మేనరిజమ్‌లు, డ్యాన్స్‌లతో అలరించాడు. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యం ఏదో ఒక వీడియో తీసి  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులకు ఎంటర్‌టైన్‌ చేశాడు. తాజాగా వార్నర్‌ బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, ఆమిర్‌ ఖాన్‌ ఇలా చాలా మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలను ఇమిటేట్‌ చేసిన వీడియో ఒకటి ట్రెండింగ్‌గా నిలిచింది. ఏఐ ఫేస్‌యాప్‌ ఉపయోగించి వార్నర్‌ డాన్‌-2 సినిమాలో షారుక్‌లా కనిపించాడు. వీడియోలో అతనిలా స్టంట్స్‌ చేస్తూ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఇరగదీశాడు. ' ఇంత వయొలన్స్‌ నేను ఎప్పుడూ చేయలేనని.. కానీ ఈ హీరో ఎవరో మీకు అర్థమై ఉంటుందంటూ క్యాప్షన్‌ జత చేశాడు. (చదవండి : ధోని రనౌట్‌కు 16 ఏళ్లు..)

దీంతో పాటు హృతిక్‌ కీలకపాత్ర పోషించిన జోదా అక్బర్‌ సినిమాలో హృతిక్‌ పాత్రలో వార్నర్‌ మెరవడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డాన్‌-2 సినిమాకు దర్శకత్వం వహించిన ఫర్హాన్‌ అక్తర్‌ వార్నర్‌ వీడియోపై వినూత్న రీతిలో స్పందించాడు. బాలీవుడ్‌కు కొత్త డాన్‌ వచ్చాడు. అతనే డేవిడ్‌ వార్నర్‌.. సారీ డేవిడ్‌ ఖాన్‌ అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు. కాగా భారత్‌, ఆసీస్‌ మధ్య జరగనున్న బాక్సింగ్‌ డే టెస్టుకు వార్నర్‌ ఆడేది అనుమానంగానే ఉంది. అతని ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు ఉండడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా రెండో టెస్టుకు అతన్ని దూరం పెట్టాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 26 నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. (చదవండి : 'మీ చిన్నారులు తెగ ముద్దొచ్చేస్తున్నారు')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement