
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ట్రావిస్ హెడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో మాక్స్‌వెల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 29న ప్రారంభం కానుంది.
ఈ రెండు టెస్టులు కూడా గాలే వేదికగానే జరగనున్నాయి. ఇక మాక్స్‌వెల్ చివరి సారిగా 2017 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. 2013లో భారత్‌పై టెస్టుల్లో మాక్స్‌వెల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడిన మాక్స్‌వెల్ 339 పరుగులతో పాటు 8 వికెట్లు సాధించాడు.
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (విసి), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్
చదవండి: వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..!
Comments
Please login to add a commentAdd a comment