IPL 2023- Mumbai Indians- Cameron Green: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ మినీ వేలం-2023లో ఏకంగా 17 కోట్లు పెట్టి కొన్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కొన్నాళ్లపాటు కేవలం బ్యాటర్‌గానే సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13 వరకు అతడు స్పెషలిస్టు బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని, ఆ తర్వాతే అతడు బౌలింగ్ చేస్తాడని సమాచారం.
ఒకవేళ ఏదేని కారణాల చేత టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడకపోతే మాత్రం ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ నుంచి బౌలింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
వేలికి గాయం!
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా గ్రీన్ కు గాయమైన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి బంతి బలంగా తాకింది. రక్తం కూడా కారడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేశాడు.
అనంతరం ఎక్స్‌రేకు వెళ్లగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు ప్రొటిస్‌తో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్ తర్వాత ఆసీస్.. భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడనుంది.
గాయం ఇబ్బంది పెడితే..
ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గ్రీన్ గనుక టెస్టు సిరీస్ ఆడితే.. నాలుగు వారాల పాటు అతడు బౌలింగ్‌కు దూరంగా ఉంటాడని సీఏ గతంలో పేర్కొంది. అయితే, ఇప్పుడు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. భారత పర్యటన నాటికి కోలుకుంటే టీమిండియాతో సిరీస్‌లో ఆడతాడు.. గాయం ఇబ్బంది పెడితే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకూ దూరమయ్యే అవకాశం లేకపోలేదు. కాగా వేలంలో ముంబై గ్రీన్ కోసం 17.5 కోట్లు ఖర్చు చేయగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు.
చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్‌కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం!
IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment