సీఏ జీతాల్లో కోత | Cricket Australia staff stood down with pay cut by 80persant | Sakshi
Sakshi News home page

సీఏ జీతాల్లో కోత

Published Fri, Apr 17 2020 1:15 AM | Last Updated on Fri, Apr 17 2020 1:15 AM

Cricket Australia staff stood down with pay cut by 80persant - Sakshi

మెల్‌బోర్న్‌: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోన్న కోవిడ్‌–19 ప్రభావం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)పై పడింది. కరోనాతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా భారీ స్థాయిలో జీతాల కోత విధింపుతో పాటు సిబ్బందిని తీసివేయనున్నట్లు సీఏ గురువారం ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 30 వరకు తమ ఉద్యోగుల, కాంట్రాక్టర్ల జీతాల్లో 80 శాతం కోత విధించనున్నట్లు సీఏ వెల్లడించింది. దీనితో పాటు ఈ పరిస్థితుల్లో ఎలాంటి క్రీడా ఈవెంట్‌లు జరిగే వీలు లేనందున ఈ రెండు నెలల పాటు కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement