హఠాన్మరణం చెందిన దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్‌ను తలచుకుని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు తనకు మెసేజ్ చేశాడంటూ సహచర ఆటగాడిని గుర్తు చేసుకున్నాడు. తన నుంచి వచ్చిన ఆ సందేశాన్ని ఎన్నడూ డెలిట్ చేయనంటూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా మార్చి 4న థాయ్‌లాండ్‌లోని విల్లాలో వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే.
అప్పటి వరకు సరాదాగా గడిపిన స్పిన్ మాంత్రికుడు హఠాన్మరణం చెందాడు. ఈ నేపథ్యంలో అతడి భౌతిక కాయాన్ని శుక్రవారం నాటికి ఆస్ట్రేలియాకు పంపించనున్నారు. ఈ క్రమంలో ఏబీసీ న్యూస్‌తో మాట్లాడిన గిల్‌క్రిస్ట్ వార్న్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
‘‘తనతో మాట్లాడి వారం కావస్తోంది. బహుశా తను చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు అనుకుంటా.. నాకో చక్కని సందేశం పంపాడు. నన్ను ముద్దుగా చర్చ్ అని పిలిచేవాడు. ఈ నిక్‌నేమ్ మా స్నేహితుల్లో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.
చనిపోవడానికి ముందు పంపిన మెసేజ్‌లో.. ‘‘చర్చ్, రాడ్ మార్ష్‌కు నువ్వు ఘన నివాళి అర్పించావు’’ అని కొనియాడాడు. అదే చివరిసారి తను నాకు పంపిన సందేశం. దానిని నా జీవితంలో డెలిట్ చేయను’’ అని గిల్‌క్రిస్ట్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఆసీస్ క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతి చెందిన గంటల వ్యవధిలోనే వార్న్ సైతం తుదిశ్వాస విడవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment