BBL 2022-23: Cricket Australia Announces Big Bash League Schedule, Date, Squad Details - Sakshi
Sakshi News home page

BBL 2022-23 Schedule: బిగ్‌ బాష్‌ లీగ్‌ 2022-23 షెడ్యూల్‌ విడుదల చేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

Published Sat, Jul 16 2022 12:53 PM | Last Updated on Sat, Jul 16 2022 1:34 PM

BBL 22-23: Cricket Australia Announces Big Bash League Schedule - Sakshi

Big Bash League 2022-23: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తరహాలో సక్సెస్‌ అయిన మరో క్రికెట్ లీగ్‌ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహా సంగ్రామానికి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. 2022-23 సీజన్‌ పురుషుల వెర్షన్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 13 నుంచి ప్రారంభంకానుండగా.. మహిళల బీబీఎల్‌ అంతకంటే రెండు నెలల ముందు అక్టోబర్ 13 నుంచి స్టార్ట్‌ అవుతుంది. 

సిడ్నీ థండర్స్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య మ్యాచ్‌తో పురుషుల బీబీఎల్‌ మొదలుకానుండగా.. బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్‌ మధ్య మ్యాచ్‌తో మహిళల టోర్నీ ప్రారంభంకానుంది. మహిళల టోర్నీ అక్టోబర్ 13న మొదలై నవంబర్ 27 వరకు జరుగనుండగా.. పురుషుల లీగ్‌ డిసెంబర్‌ 13 నుంచి వచ్చే​ ఏడాది (2023) జనవరి 25 వరకు జరుగుతుంది. ఈ రెండు లీగ్‌లకు సంబంధించిన ఫిక్షర్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి.. 


చదవండి: BBL: మరోసారి రెనెగేడ్స్‌తో జట్టు కట్టిన భారత కెప్టెన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement