Australia Cricket Team New Head Coach: జస్టిన్ లాంగర్ రాజీనామా నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌ను నియమించింది. ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. కాగా ఆసీస్ కోచ్‌గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్ విజ్ఞప్తి పట్ల బోర్డు సానుకూలంగా స్పందించలేదు.
దీంతో అతడు తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో ఆండ్రూకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. ఇక ఆస్ట్రేలియా తరఫున 2009లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆండ్రూ అదే ఏడాది తన చివరి మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో టీమిండియాతో 2009లో జరిగిన సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళరూకు ప్రాతినిథ్యం వహించాడు. 2013లో ఆండ్రూ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
చదవండి: Justin Langer: ఆసీస్ హెడ్‌కోచ్‌కు షాకిచ్చిన బోర్డు.. టీ20 వరల్డ్‌కప్, యాషెస్ విజయాలు.. అయినా తప్పని రాజీనామా
U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు!
JUST IN: @CricketAus confirms Andrew McDonald has been appointed interim head coach of the Aussie men's team. More to come.
— cricket.com.au (@cricketcomau) February 5, 2022
Comments
Please login to add a commentAdd a comment