మెల్‌బోర్న్: భారత ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ ‘డిస్నీ–స్టార్’తో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సుదీర్ఘ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే క్రికెట్ మ్యాచ్‌ల్ని భారత్‌లో ఏడేళ్లపాటు ప్రసారం చేసే ఒప్పందాన్ని డిస్నీ స్టార్‌తో కుదుర్చుకుంది.
వచ్చే సీజన్ (2023–24) నుంచి ఒప్పందంలో భాగంగా ఆసీస్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్), మహిళల బీబీఎల్ టోర్నమెంట్లను భారత్‌లో డిస్నీ–స్టార్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తుంది.
ప్రస్తుతం సోనీ నెట్‌వర్క్ వద్ద సీఏ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులున్నాయి. 2017–18 సీజన్ నుంచి సోనీ చానెళ్లు ఆస్ట్రేలియా మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్నాయి. క్రికెట్ క్రేజ్ ఉన్న భారత్‌లో తమ మ్యాచ్‌ల ఆదరణ మరింత పెరిగేందుకు స్టార్ నెట్‌వర్క్‌తో ఒప్పందం దోహదం చేస్తుందని సీఏ సీఈఓ నిక్ హాక్లీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment