సిడ్నీ : భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఆసీస్ నుంచి మరో కీలక ఆటగాడు దూరమయ్యాడు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల రిత్యా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇదే విషయంపై ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. 'కుటుంబ కారణాల రిత్యా స్టార్క్ టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచంలో అన్నింటి కన్నా కుటుంబం ముఖ్యం.. దాని తరువాతే ఏదైనా. మిచెల్‌కు కావలసినంత సమయాన్ని ఇస్తాం. తాను అనుకున్నప్పుడే జట్టులోకి రావచ్చు. అయితే మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తాడనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. తన కోసం ఎదురు చూస్తుంటాం.' అని లాంగర్ పేర్కొన్నాడు. (చదవండి : ప్రియురాలి కోరిక.. సొంత దేశానికి రిటైర్మెంట్)
కాగా ఆసీస్ జట్టును గాయాల బెడద పీడిస్తోంది. వన్డే సిరీస్ తర్వాత స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఆస్టన్ అగర్ దూరం కాగా.. తాజాగా స్టార్క్ కూడా దూరమయ్యాడు. కాగా నేడు జరిగే మ్యాచ్‌లో ఆసీస్ జట్టు స్టార్క్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందనేది వేచి చూడాలి. కాగా ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమిండియా మరో విజయం సాధించి సిరీస్ గెలవాలని చూస్తుంటే.. ఆసీస్ మాత్రం మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తుంది. (చదవండి : 'గిల్.. ఇదేమైనా క్లబ్ క్రికెట్ అనుకున్నావా')
Comments
Please login to add a commentAdd a comment