సమరవీర (ఎడమవైపు ఉన్న వ్యక్తి)
శ్రీలంక మాజీ క్రికెటర్ దులిప్ సమరవీరకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలో కోచ్‌గా పనిచేస్తున్న అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 20 ఏళ్ల నిషేధం విధించింది. ఫలితంగా.. రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయిలోనూ అతను పనిచేయడానికి వీలుండదు.
ప్రస్తుతం విక్టోరియా రాష్ట్ర మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న సమరవీర.. ఓ మహిళా క్రికెటర్‌తో బలవంతంగా సంబంధం పెట్టుకోవడంపై సీఏ కన్నెర్ర చేసింది. అంతేకాదు.. సమరవీర తీవ్రమైన అతిక్రమణకు పాల్పడ్డాడని ఆగ్రహించింది. ఇది సీఏ నియమావళికి విరుద్ధమని, క్రికెట్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను అసీస్ బోర్డు ఉపేక్షించదని ఒక ప్రకటనలో పేర్కొంది.
2008 నుంచి ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో
కాగా సమరవీర 1993–1995 మధ్య కాలంలో శ్రీలంక తరఫున ఏడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు. తదనంతరం 2008లో ఆస్ట్రేలియాలో కోచింగ్ బృందంలో చేరాడు. మొదట క్రికెట్ విక్టోరియా మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. సుదీర్ఘకాలం పాటు విక్టోరియా జట్టుకు సేవలందించాడు.
అదే విధంగా.. మహిళల బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. రెండు వారాల క్రితం విక్టోరియా సీనియర్ మహిళల జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమించారు. కానీ ఓ మహిళా క్రికెటర్‌తో పెట్టుకున్న అనుచిత సంబంధం ఆస్ట్రేలియాతో బంధాన్నే తెగదెంపులు చేసింది. నిషేధం కారణంగా.. అతడు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియాలో ఏ స్థాయి జట్టుకు, లీగ్‌లకు, అకాడమీకి, బోర్డుకు పనిచేయడానికి వీలుండదు.
చదవండి: రూ. 45 లక్షలు ఇస్తేనే భారత్‌కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్
Comments
Please login to add a commentAdd a comment