బీసీసీఐ అదాయం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. ఆస్ట్రేలియా కంటే 28 రేట్లు ఎక్కువ! | Reports: BCCIs net worth over INR 18 700 crore, CA second with INR 660 crore | Sakshi
Sakshi News home page

#BCCI: బీసీసీఐ అదాయం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. ఆస్ట్రేలియా కంటే 28 రేట్లు ఎక్కువ!

Published Sat, Dec 9 2023 10:56 AM | Last Updated on Sat, Dec 9 2023 12:21 PM

Reports: BCCIs net worth over INR 18 700 crore, CA second with INR 660 crore - Sakshi

బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ప్రపంచక్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్‌ బోర్డు కొనసాగిస్తోంది. ప్రతీ ఏటా  తమ నికర అదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ పోతుంది. క్రిక్‌బజ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ప్రస్తుతం బీసీసీఐ నెట్‌ వర్త్‌ 2.25 బిలియన్‌ డాలర్లు (రూ.18760 కోట్లు). కాగా ఇతర ఏ క్రికెట్‌ బోర్డు కూడా బీసీసీఐ దారిదాపుల్లో లేదు.

భారత క్రికెట్‌ బోర్డు తర్వాత రెండో స్ధానంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక అదాయం 79 మిలియన్‌ డాలర్లు(రూ. 660 కోట్లు). అంటే ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రేట్లు అధికంగా ఉంది. ఇక ఈ జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు ఉంది. ఈసీబీ నెట్‌వర్త్‌ 59 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.490 కోట్లు).

బీసీసీఐకి అదాయం ఎలా అంటే?
బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్‌ బోర్డులు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను, టోర్నమెంట్‌ నిర్వహణ, క్రికెట్‌ ఆసోషియేషన్‌లకు నిధుల రిలీజ్‌ చేయడం వంటివి చూసుకుంటాయి. బోర్డులకు మీడియా రైట్స్‌, స్పాన్సర్‌ షిప్‌ల రూపంలో  అదాయాన్ని పొందుతాయి.  కాగా ఐపీఎల్‌ ద్వారా భారత క్రికెట్ బోర్డు ఆర్థిక వృద్ధి బాగా పెరిగింది. ఐపీఎల్‌ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా అర్జిస్తోంది.   2023-27 ​కాలానికి గాను ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ కోసం మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి రూ. 48,390.32 కోట్లు చెల్లించాయి.

వరల్డ్‌కప్‌ ద్వారా భారీ అదాయం..
వన్డే వరల్డ్‌కప్‌-2023కు భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. భారత అర్ధిక వ్యవస్ధపై మాత్రం కాసుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఎకమోనిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. రూ. 22,000 కోట్లు భారత అర్ధిక వ్యవస్ధలోకి వచ్చినట్లు సమాచారం.
చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్‌.. సౌతాఫ్రికాకు ఊహించని షాక్‌! ఇక అంతే సంగతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement