Courtesy: IPL Twitter
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్.. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2022 నుంచి వైదొలిగాడు. తుంటి ఎముక గాయం కారణంగా కమిన్స్ లీగ్‌ను వీడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికి వచ్చే నెలలో శ్రీలంక పర్యటన ఉన్న కారణంగా కమిన్స్ ఐపీఎల్ వీడినట్లు సమాచారం. ప్రస్తుతం స్వదేశానికి పయనమయిన కమిన్స్ సిడ్నీలోని రీహాబిలిటేషన్ సెంటర్‌కు చేరుకోనున్నాడు.
లంకతో సిరీస్ వరకు ఫిట్‌నెస్ సాధించి వన్డే, టెస్టు సిరీస్‌లకు సిద్దంగా ఉండాలని కమిన్స్ భావించాడు. కాగా లంకతో టి20 సిరీస్‌కు కమిన్స్ దూరంగా ఉండనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా సిరీస్ జరగడంపై అనుమానాలు ఉన్నప్పటికి.. దుబాయ్ వేదికగా ఈ సిరీస్‌ను నిర్వహించాలనే యోచనలో లంక్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఐపీఎల్‌లో కేకేఆర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కమిన్స్ ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 56 పరుగులు సాధించి ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఫిఫ్టీ అందుకున్న బ్యాటర్‌గా కేఎల్ రాహుల్‌తో కలిసి కమిన్స్ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కమిన్స్ 63 పరుగులతో పాటు బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్ 22 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కేకేఆర్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కేకేఆర్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికి ప్లే ఆఫ్ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
చదవండి: Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌షాక్.. కీలక సమయంలో యువ ఆటగాడు దూరం!
IPL 2022: సీఎస్‌కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్‌ఆర్‌హెచ్ బాటలోనేనా!
Comments
Please login to add a commentAdd a comment