సిడ్నీ: గడిచిన ఏడాదికి సంబంధించి అత్యుత్తమ వన్డే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప‍్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని నియమించింది. ఈ మేరకు 11 మందితో కూడిన అత్యుత్తమ జట్టును సీఏ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి కోహ్లితో పాటు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించింది. కాగా, ఆసీస్ నుంచి ఏ ఒక్క ప్లేయర్‌కు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో(ఇంగ్లండ్)లను ఎంపిక చేసిన సీఏ.. ఇక ఫస్ట్ డౌన్‌లో జోరూట్, సెకండ్ డౌన్‌లో కోహ్లిలను ఎంపిక చేసింది.
గడిచిన ఏడాది కోహ్లి విశేషంగా రాణించడమే సీఏ ప్రకటించిన అత్యుత్తమ జట్టుకు కెప్టెన్‌గా నియమించడానికి ప్రధాన కారణం. 2018లో 14 వన్డేలు ఆడిన కోహ్లి 1,200కు పైగా పరుగులు సాధించాడు. సుమారు 134 సగటుతో ఆరు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలను కోహ్లి నమోదు చేశాడు. ఇక గత ఏడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు సాధించిన బూమ్రాను ప్రధాన పేసర్‌గా ఎంపిక చేసింది.
క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ ఇదే: విరాట్ కోహ్లి( కెప్టెన్, భారత్), రోహిత్ శర్మ(భారత్), బెయిర్ స్టో(ఇంగ్లండ్), జో రూట్(ఇంగ్లండ్), హెట్‌మెయిర్(వెస్టిండీస్), జాస్ బట్లర్(వికెట్ కీపర్, ఇంగ్లండ్), తిషారా పెరీరా(శ్రీలంక), రషీద్ ఖాన్(అఫ్గానిస్తాన్), కుల్దీప్ యాదవ్(భారత్), ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), బూమ‍్రా(భారత్)
Comments
Please login to add a commentAdd a comment