
ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లెఫ్ట్మ్ ఆర్మ్ స్పిన్నర్ బెన్ లిస్టర్‌తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. నాలుగు వన్డేల సిరీస్‌లో రెండో వన్డే సెప్టెంబర్ 10న సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.
ఇప్పటికే తొలి వన్డేలో 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అయితే వన్డే ప్రపంచకప్‌కు ముందు మిల్నే గాయ పడడం జట్టు మేనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇక ఇదే విషయంపై కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "ఆడమ్ మిల్నే మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.
వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు సమయం దగ్గరపడుతుండంతో అతడిని ఈ సిరీస్‌లో ఆడించి రిస్క్ చేయకూడదని భావించాము. అందుకే అతడికి విశ్రాంతిని ఇచ్చాము. వరల్డ్‌కప్‌కు ఆటగాళ్లు గాయపడకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఇక బెన్ లిస్టర్ కూడా ప్రస్తుతం జట్టుతో పాటు ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. దీంతో వెంటనే అతడు మిల్నే స్ధానాన్ని భర్తీ చేశాడు. బెన్ యూఏఈ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌లో వార్మప్ మ్యాచ్‌లలో మమ్మల్ని ఆకట్టుకున్నాడు అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Asia Cup 2023: కొలంబోలో చివరగా టీమిండియా ఎప్పుడు ఆడిందంటే? అప్పుడు సంజూ!