భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో కివీస్ జట్టు స్టార్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ నాయకత్వం వహించనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమి అనంతరం టిమ్ సౌథీ బ్లాక్ క్యాప్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
అతడి స్ధానంలో లాథమ్ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు బెంగళూరు వేదికగా జరిగే తొలి టెస్టుకు కివీ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరమయ్యాడు. శ్రీలంక సిరీస్‌లో గజ్జ గాయానికి గురైన కేన్ మామ.. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. రెండో టెస్టు సమయానికి అతడు కోలుకునే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఈ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ మార్క్ చాప్‌మన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు.
బ్లాక్ క్యాప్స్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తాచాటుతున్న చాప్‌మన్.. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ మైఖల్ బ్రేస్‌వెల్ కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. తన భార్య బిడ్డకు జన్మనివ్వనుండడంతో బ్రేస్‌వెల్ తొలి టెస్టు అనంతరం న్యూజిలాండ్‌కు పయనం కానున్నాడు. ఆక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్-భారత మధ్య ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు టెస్టు మాత్రమే), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
చదవండి: PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్
Comments
Please login to add a commentAdd a comment