2023 సంవత్సరపు అత్యుత్తమ వన్డే జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారధిగా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు.
వీరితో పాటు ఆసీస్ ఆటగాళ్లు ట్రవిస్ హెడ్, ఆడమ్ జంపా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో ఏకంగా ఎనిమిది మంది (భారత్ (6)+ ఆస్ట్రేలియా (2)) వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనలిస్ట్‌లకు చోటు దక్కడం విశేషం. మిగిలిన మూడు బెర్త్‌లను సౌతాఫ్రికా ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసన్, మార్కో జన్సెన్, న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ దక్కించుకున్నాడు.
ఐసీసీ వన్డే జట్టుకు ఓపెనర్లుగా రోహిత్, శుభ్‌మన్ గిల్ ఎంపిక కాగా.. వన్‌డౌన్ బ్యాటర్‌గా ట్రవిస్ హెడ్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో ప్లేస్‌లో డారిల్ మిచెల్, వికెట్‌కీపర్ బ్యాటర్‌గా హెన్రిచ్ క్లాసెన్, ఆల్‌రౌండర్ కోటాలో మార్కో జన్సెన్, స్పిన్నర్లుగా జంపా, కుల్దీప్, పేసర్లుగా షమీ, సిరాజ్ ఎంపికయ్యారు. ఐసీసీ తమ అత్యుత్తమ వన్డే జట్టులో వన్డే వరల్డ్‌కప్ 2023 సెమీఫైనలిస్ట్‌లకు మాత్రమే చోటు కల్పించడం మరో విశేషం.
ఇదిలా ఉంటే, ఐసీసీ నిన్ననే 2023 అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కూడా టీమిండియా ఆటగాడే సారధిగా ఎంపికయ్యాడు. విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు సభ్యులుగా చోటు లభించింది. ఫిలిప్ సాల్ట్, నికోలస్ పూరన్, మార్క్ చాప్‌మన్, సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రిచర్డ్ నగరవ సభ్యులుగా చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment