
Harmanpreet Singh, Gurjit Kaur Win FIH Awards: అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) స్టార్స్ అవార్డ్స్ 2020-21లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. పురుషులు, మహిళల విభాగాల్లో నలుగురు క్రీడాకారులు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. వీరితో డ్రాగ్ ఫ్లికర్స్ హర్మన్ ప్రీత్ సింగ్, గుర్జిత్ కౌర్‌లు "ప్లేయర్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను గెలుచుకోగా.. పీఆర్ శ్రీజేష్, సవితా పునియాలు "ఉత్తమ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను దక్కించుకున్నారు.
కాగా, భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్‌లో అబ్బురపడే ప్రదర్శనతో అలరించిన సంగతి తెలిసిందే. పురుషుల జట్టు 41 సంవత్సరాల ఒలింపిక్ పతకాల కరువుకు తెరదించుతూ.. జర్మనీపై 5-4 గోల్స్‌తో విజయం సాధించి కాంస్య పతకం నెగ్గింది. మహిళల జట్టు నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
చదవండి: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..!