Player of the Year award
-
ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. మొదటి బ్యాచ్‌తో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకున్న ఈ రన్‌మెషీన్.. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో తను గెలుచుకున్న ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తాజాగా అందుకున్నాడు కోహ్లి. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్‌ను కూడా స్వీకరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా 2023లో విరాట్ కోహ్లి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గతేడాది 27 వన్డేలు ఆడి 1377 పరుగులు సాధించాడు.ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది కోహ్లి అత్యుత్తమ స్కోరు 166*. అదే విధంగా ఆసియా కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సూపర్ స్టేజ్‌లో సాధించిన 122(నాటౌట్) కూడా హైలైట్‌గా నిలిచిపోయింది.ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఈ రికార్డుల రారాజు దుమ్ములేపిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో 11 మ్యాచ్‌లలో కలిపి 765 పరుగులు సాధించాడు కోహ్లి. టాప్ స్కోరర్‌గా నిలవడమే గాకుండా.. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతేగాక వన్డేల్లో 50వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా వార్మప్ మ్యాచ్‌కు కోహ్లి(విశ్రాంతి) దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన బంగ్లాను 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
అప్పుడు సెరెనా... ఇప్పుడు స్వియాటెక్!
పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ వరుసగా రెండో ఏడాది ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. మహిళల టెన్నిస్ సంఘంలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా ఆమె నిలిచింది. 22 ఏళ్ల స్వియాటెక్ 2023లో ఆరు టైటిళ్లను సాధించింది. గతంలో వరుసగా రెండేళ్లు, అంతకుమించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన రికార్డు అమెరికన్ దిగ్గజం సెరెనా విలియమ్స్ పేరిట ఉంది. సెరెనా 2012 నుంచి నాలుగేళ్ల పాటు ఆ అవార్డు సాధించింది. -
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న హార్ధిక్
భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ) 2022 సంవత్సరానికిగాను భారత జట్టుకు సంబంధించి వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్, మహిళల విభాగంలో సవితా పూనియా హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా నిలిచారు. ఒడిషాలో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో హార్దిక్ అద్భుత ఆటతీరు కనబర్చాడు. ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ నేషనల్ కప్ టైటిల్ గెలిపించి ప్రొ లీగ్‌కు భారత జట్టు అర్హత సాధించడంలో కీపర్‌గా, కెప్టెన్‌గా సవిత కీలక పాత్ర పోషించింది. ఇద్దరికీ హాకీ ఇండియా తరఫున రూ. 25 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. దీంతో పాటు 2021కు సంబంధించిన అవార్డులను కూడా ప్రకటించగా హర్మన్‌ప్రీత్, సవితా పూనియా అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డులు అందుకున్నారు. 2022లో సుల్తాన్ జొహర్ కప్ గెలిచిన భారత జూనియర్ జట్టును కూడా ఈ సందర్భంగా సత్కరించారు. -
T20 World Cup 2022: ఆస్ట్రేలియా చిత్తు చిత్తుగా...
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’ పోరు అనూహ్య ఫలితంతో మొదలైంది. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే భారీ పరాజయం ఎదురైంది. గత వరల్డ్ కప్ ఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ న్యూజిలాండ్ ఆతిథ్య జట్టును 89 పరుగుల తేడాతో ఓడించి షాక్ ఇచ్చింది. 2011 తర్వాత ఆసీస్ గడ్డపై కివీస్‌కు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇదే తొలి విజయం కాగా, 15 ఓటముల తర్వాత 16వ మ్యాచ్‌లో గెలుపు దక్కింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (16 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఇచ్చిన శుభారంభం కూడా కివీస్ భారీ స్కోరుకు కారణమైంది. చివర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడి స్కోరును 200 పరుగులకు చేర్చాడు. హాజల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కగా, ఐదుగురు ఆసీస్ బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియా కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేక, మరో 23 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలిపోవడం విశేషం. కివీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయిన ఆసీస్ 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ఫర్వాలేదనిపించారు. సాన్‌ట్నర్‌కు 3 వికెట్లు దక్కగా, 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన టిమ్ సౌతీ... అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (125) తీసిన బౌలర్‌గా నిలిచాడు. -
FIH Player of the Year: హర్మన్‌ప్రీత్‌కు ‘ఎఫ్ఐహెచ్’ అవార్డు
న్యూఢిల్లీ: భారత స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను నిలకడైన ఆటతీరుతో ఇంటాబయటా జట్టు విజయాల్లో కీలకభూమిక పోషిస్తున్నాడు. ఈ భారత వైస్‌కెప్టెన్ 2021–22 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో విశేషంగా రాణించాడు. 16 మ్యాచ్‌లాడిన హర్మన్‌ప్రీత్ 18 గోల్స్ చేశాడు. దీంతో ఒక సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అతని (6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్) ప్రదర్శన వల్లే భారత జట్టు కాంస్యం గెలిచింది. ప్రతీ మ్యాచ్ లోనూ గోల్ చేయడం విశేషం. ఈ ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ గేమ్స్’లో భారత్ రన్నరప్‌గా నిలువడంలోనూ అతని పాత్ర ఉంది. ‘హర్మన్‌ప్రీత్ ఆధునిక హాకీ క్రీడలో సూపర్‌స్టార్. అతని డిఫెన్స్ అద్భుతం. ప్రత్యర్థుల రక్షణపంక్తిని బోల్తా కొట్టించడంలో అతను ఘనాపాటి. తన స్టిక్కు అందిన బంతిని చకచకా ఆడిస్తూ తీసుకెళ్లే సామర్థ్యం అతని సొంతం. అదే వేగంతో గోల్‌పోస్ట్‌లోకి పంపడంలోనూ హర్మన్ దిట్ట. అందుకే వరుసగా ఈ ఏడాది కూడా అతన్నే అవార్డు వరించింది’ అని ఎఫ్ఐహెచ్ ఒక ప్రకటనలో కొనియాడింది. పురుషుల హాకీలో వరుసగా ఇలా అవా ర్డులు పొందిన నాలుగో ఆటగాడిగా హర్మన్ ఘనత వహించాడు. గతంలో డి నూయిజెర్ (నెదర్లాండ్స్), జేమీ డ్వెయర్ (ఆస్ట్రేలియా), ఆర్థర్ వాన్ డొరెన్ (బెల్జియం)లు రెండేళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచారు. తాజా అవార్డు బరిలో ప్యానెల్... హర్మన్ ప్రీత్ సింగ్‌కు 29.4 పాయింట్లు ఇవ్వగా, రేసులో ఉన్న బ్రింక్ మన్ (నెదర్లాండ్స్; 23.6), టామ్ బూన్ (బెల్జియం; 23.4) వెనుకబడ్డారు. -
ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కివీస్ స్టార్ ఆల్‌రౌండర్
Tim Southee Wins Sir Richard Hadlee Medal: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ టిమ్ సౌథీ.. తన దేశ క్రికెట్‌కు సంబంధించి ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2021-22 సీజన్ ఆధ్యాంతం అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు గాను అతను సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకాన్ని గెలుచుకున్నాడు. సౌథీ తన 14 ఏళ్ల కెరీర్లో ఈ మెడల్‌ను గెలవడం ఇదే తొలిసారి. ఇవాళ (ఏప్రిల్ 14న) జరిగిన న్యూజిలాండ్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో సౌథీ ఈ మెడల్‌తో పాటు 2022 సంవత్సరానికి గాను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. సౌథీ 2021-22 సీజన్లో 23.88 సగటున 36 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్‌పై సాధించిన ఐదు వికెట్ల ఘనత కూడా ఉంది. సౌథీ.. న్యూజిలాండ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించడంతో పాటు గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో తన జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. సౌథీ ఇటీవలి భారత పర్యటనలో న్యూజిలాండ్ జట్టుకు సారధిగా (కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో) కూడా వ్యవహరించాడు. కెరీర్లో ఇప్పటివరకు 85 టెస్ట్‌లు, 143 వన్డేలు, 92 టీ20లు ఆడిన సౌథీ.. 639 వికెట్లతో పాటు 2697 పరుగులు సాధించాడు. చదవండి: వన్డేల్లో సరికొత్త రికార్డు.. 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు -
U19 WC: ద్రవిడ్, లక్ష్మణ్ మాస్టర్ ప్లాన్.. వాళ్ళ రాతలు మారిపోతాయి!
న్యూఢిల్లీ: మనోజ్ కల్రా... 2018 అండర్–19 ప్రపంచకప్ గెలిచినప్పుడు ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’. అయితే నాలుగేళ్ల తర్వాత కూడా అతని కెరీర్ ఊపందుకోలేదు. కల్రా మాత్రమే కాదు... ఎంతో మంది కుర్రాళ్లు వరల్డ్‌కప్ లాంటి విజయం తర్వాత కూడా ముందుకు దూసుకుపోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అండర్–19 వయో విభాగానికి, రంజీ ట్రోఫీకి మధ్య ఉన్న అంతరం కారణంగా వారికి సరైన మార్గనిర్దేశనం లేకుండా పోతోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జూనియర్ నుంచి సీనియర్ స్థాయికి ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను వారు అధిగమించలేక వెనుకబడిపోతున్నారు. ఇలాంటి ఆటగాళ్ల కోసం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఒక ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ‘19 ప్లస్’ పేరుతో ఉండే ఈ బృందంలో అండర్–19 వరల్డ్‌కప్ విజేతలతో పాటు అదే వయో విభాగంలో దేశవ్యాప్తంగా ప్రతిభ గల ఆటగాళ్లను చేరుస్తారు. పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తూ సాధనతో పాటు అవకాశం ఉన్నప్పుడల్లా (అండర్–25 తదితర) ఆయా రాష్ట్ర జట్ల తరఫున ఆడే అవకాశం కల్పిస్తారు. ఇదంతా ఎన్సీఏ పర్యవేక్షణలో జరుగుతుంది. భారత కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లు జాతీయ సీనియర్, జూనియర్ సెలక్టర్లతో ఈ అంశంపై చర్చించి త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. -
భారత హాకీ క్రీడాకారులకు అంతర్జాతీయ పురస్కారాలు
Harmanpreet Singh, Gurjit Kaur Win FIH Awards: అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) స్టార్స్ అవార్డ్స్ 2020-21లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. పురుషులు, మహిళల విభాగాల్లో నలుగురు క్రీడాకారులు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. వీరితో డ్రాగ్ ఫ్లికర్స్ హర్మన్ ప్రీత్ సింగ్, గుర్జిత్ కౌర్‌లు "ప్లేయర్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను గెలుచుకోగా.. పీఆర్ శ్రీజేష్, సవితా పునియాలు "ఉత్తమ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను దక్కించుకున్నారు. కాగా, భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్‌లో అబ్బురపడే ప్రదర్శనతో అలరించిన సంగతి తెలిసిందే. పురుషుల జట్టు 41 సంవత్సరాల ఒలింపిక్ పతకాల కరువుకు తెరదించుతూ.. జర్మనీపై 5-4 గోల్స్‌తో విజయం సాధించి కాంస్య పతకం నెగ్గింది. మహిళల జట్టు నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. చదవండి: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..! -
‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా మన్‌ప్రీత్ సింగ్
లుసానే: భారత పురుషుల హాకీ జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించిన సారథి మన్‌ప్రీత్ సింగ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.పురుషుల విభాగంలో 2019 ఏడాదికి గానూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెల్చుకున్నాడు. దాంతో ఈ అవార్డును గెల్చుకున్న తొలి భారత హాకీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ అవార్డు కోసం బెల్జియం ప్లేయర్ ఆర్థర్ వాన్ డోరెన్, అర్జెంటీనా ఆటగాడు లుకాస్ విల్లాలు పోటీ పడగా... పోలైన మొత్తం ఓట్లలో 35.2 శాతం ఓట్లను దక్కించుకున్న మన్‌ప్రీత్ విజేతగా నిలిచాడు. ఆర్థర్ 19.7 శాతం, లుకాస్ 16.5 శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ అవార్డును తన జట్టు సభ్యులకు అంకితమిస్తున్నట్లు మన్‌ప్రీత్ తెలిపాడు. 2019లో తమ ప్రధాన లక్ష్యం ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే అని... రష్యాతో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా ఒలింపిక్ కల నెరవేరిందని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. 2011లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన మన్‌ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు 263 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడాడు. అంతే కాకుండా 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ల్లో భారత్‌కు ఆడాడు. 2017లో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇక వెనుదిరిగి చూడలేదు. ముఖ్యంగా 2019లో భారత హాకీ జట్టుకు అద్వితీయమైన విజయాలను అందించాడు. భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ చాంపియన్‌గా భారత్‌ను నిలబెట్టడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్తును ఖాయం చేశాడు. వీటితో పాటు టోక్యోలో జరిగిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ విజేతగా... సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఫైనల్స్‌కు భారత్‌ను చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే మన్‌ప్రీత్‌తో పాటు భారత యువ మిడ్‌ఫీల్డర్ వివేక్ సాగర్ ప్రసాద్ ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెల్చుకున్నాడు. మహిళల విభాగంలో ఇదే అవార్డును భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గెల్చుకుంది. -
స్మృతీ మంధాన అరుదైన ఘనత
దుబాయ్: ఈ ఏడాదికిగాను భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధాన వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌తో పాటు వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది అద్భుతంగా రాణించిన మంధాన ఒక క్యాలెండర్ ఇయర్లో రెండు ఐసీసీ అవార్డులను దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డును నెలకొల్పారు. ప్రధానంగా వెస్టిండీస్‌లో మహిళా వరల్డ్ టీ20ల్లో భారత్ సెమీ ఫైనల్ చేరడంలో మంధాన కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీలో 125పైగా స్ట్రైక్‌రేట్‌తో 178 పరుగులు సాధించారు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మంధాన ఓవరాల్‌గా 1291 పరుగులు చేశారు. 12 వన్డేలకు గాను 669 పరుగులు సాధించిన మంధాన.. 25 టీ20ల్లో 622 పరుగులు చేశారు. ఈ ఏడాది వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించడం మరో విశేషం. అదే సమయంలో ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ వన్డే, టీ20 జట్లలో కూడా మంధాన చోటు దక్కించుకున్నారు. దాంతో ఏక కాలంలో రెండు ఐసీసీ అవార్డులు మంధాన సొంతమయ్యాయి. 2018 ప్రదర్శనలో భాగంగా మీడియా-బ్రాడ్‌కాస్టర్స్ సభ్యులతో కూడిన బృందం ఓటింగ్ పద్ధతిలో అత్యుత్తమ క్రీడాకారిణులను ఎన్నుకోవడంతో పాటు రెండు అత్యుత్తమ జట్లను ఎంపిక చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సోమవారం తన అధికారిక ట్విట్టర్లో వివరాలను వెల్లడించింది. -
సునీల్ చెత్రికి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించిన 2017 వార్షిక అవార్డుల్లో భారత కెప్టెన్, సాకర్ స్టార్ సునీల్ చెత్రి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. బైచుంగ్ భూటియా తర్వాత వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడిగా ఈ స్ట్రయికర్ ఘనత వహించిన సంగతి తెలిసిందే. మహిళల కేటగిరీలో ఈ అవార్డు మణిపూర్‌కు చెందిన కమలా దేవికి దక్కింది. ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో రాణించిన అనిరుధ్ థాపా ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. -
ఈ యేటి మేటి సునీల్ చెత్రి
* వరుసగా రెండో ఏడాది అవార్డు * ఏఐఎఫ్ఎఫ్ వార్షిక పురస్కారాలు న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి వరుసగా రెండో ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకున్నాడు. ఐ-లీగ్‌లో తను బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తరఫున ఆడి ఈ ఏడాది 14 గోల్స్ సాధించాడు. ఈ అవార్డు కింద చెత్రికి ట్రోఫీతో పాటు రూ.2 లక్షల బహుమతి లభించనుంది. మరోవైపు ‘మహిళల ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్’గా బాలా దేవి ఎంపికైంది. కోచ్‌గా కాన్స్టాంటైన్: భారత జట్టు ఫుట్‌బాల్ చీఫ్ కోచ్‌గా స్టీఫెన్ కాన్స్టాంటైన్ ఎంపికయ్యారు. వచ్చే వారం అధికారికంగా ఆయన పేరును ప్రకటిస్తారు. గతంలో స్టీఫెన్ 2002 నుంచి 2005 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశారు. 171కి దిగజారిన ర్యాంకు: ఐఎస్ఎల్ సూపర్ సక్సెస్‌తో ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆకర్షించిన భారత్... ఫిఫా ర్యాంకింగ్స్‌లో మాత్రం తొలిసారిగా 171వ ర్యాంకుకు దిగజారింది. మొత్తం 209 దేశాలకు ర్యాంకింగ్‌ను ప్రకటించారు.